ఇతర రాష్ట్రాల నుంచి ఆంధ్రప్రదేశ్‌కు రావాలంటే ఈ-పాస్ తప్పనిసరి అని ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ అన్నారు. ఉదయం 6గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఏపీలోకి వచ్చే వారికి ఈ-పాస్ లు అవసరం లేదన్న డీజీపీ... మధ్యాహ్నం 12 గంటల తర్వాత ఏపీలోకి వచ్చే ప్రయాణికులు ఈ-పాస్‌ను కచ్చితంగా కలిగి ఉండాలని స్పష్టం చేశారు. సంబంధిత ప్రభుత్వ వెబ్సైట్ల ద్వారా ఈ-పాస్‌ను పొందవచ్చని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పేర్కొన్న అత్యవసర సేవలకు ఈ-పాస్ అవసరం లేదన్నారు.
ఏపీలోకి ప్రవేశించే ప్రయాణికులు ఈ-పాస్ తప్పనిసరి - andhrapradesh boarder news
కర్ఫ్యూ సమయంలో ఆంధ్రప్రదేశ్‌లోకి ప్రవేశించే ప్రయాణికులు తప్పనిసరిగా ఈ-పాస్‌ను కలిగి ఉండాలని ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ అన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పేర్కొన్న అత్యవసర సేవలకు ఈ-పాస్ అవసరం లేదన్నారు.

ఏపీలోకి ప్రవేశించే ప్రయాణికులు ఈ-పాస్ తప్పనిసరి
ఆంధ్రప్రదేశ్‌కు పొరుగు రాష్ట్రాలైన తెలంగాణ, తమిళనాడు, ఒడిశా, కర్ణాటకల్లో కర్ఫ్యూ.. లాక్డౌన్ అమలులో ఉన్నందున ఆయా రాష్ట్రాల్లోకి ప్రవేశించాలంటే సంబంధిత రాష్ట్రాలు జారీ చేసిన ఈ-పాస్‌ను కలిగి ఉండాలని సూచించారు. ఇతర రాష్ట్రాలకు అంబులెన్స్‌లో ప్రయాణించే వారికి ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖ ద్వారా సహాయసహకారాలు అందిస్తామని డీజీపీ గౌతమ్ సవాంగ్ అన్నారు.
సంబంధిత కథనం:ఈ-పాసుల తిరస్కరణపై ట్విట్టర్లో డీజీపీకి ఫిర్యాదు