తెలంగాణ

telangana

ETV Bharat / city

Dk aruna fire on Trs: ప్రజలను రెచ్చగొట్టి పబ్బం గడుపుకుంటున్న కల్వకుంట్ల కుటుంబం

Dk aruna fire on kalvakuntla family: కల్వకుంట్ల కుటుంబం ప్రజలను రెచ్చగొట్టి పబ్బం గడుపుకుంటోందని భాజపా జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ ఆరోపించారు. ఇప్పుడు మళ్లీ ఉత్తర భారత దేశం, దక్షిణ భారత దేశం అంటూ కొత్త రాగం ఎత్తుకొని మరోసారి ప్రజలను పక్క దారి పట్టిస్తున్నారని మండిపడ్డారు. తండ్రి కొడుకులకు ఓటమి భయం పట్టుకుందని.. ఎదో విధంగా మరోసారి అధికారం దక్కించుకునేందుకు రోజుకో కొత్త వేషం వేస్తున్నారని విమర్శించారు.

dk aruna
డీకే అరుణ

By

Published : Feb 18, 2022, 12:01 PM IST

Dk aruna fire on kalvakuntla family: కల్వకుంట్ల కుటుంబం ప్రజలను రెచ్చగొట్టి పబ్బం గడుపుకుంటుందని భాజపా జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ మండిపడ్డారు. ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు ముందు ఆంధ్ర, తెలంగాణ పేరు చెప్పి అమాయక యువత చావులకు కారకుడై.. సీఎం కుర్చీలో కూర్చుని అమరుల కుటుంబాలను గాలికి వదిలేసిన దుర్మార్గులని ఒక ప్రకటనలో ఆమె ధ్వజమత్తారు.

ఇప్పుడు మళ్లీ ఉత్తర భారత దేశం, దక్షిణ భారత దేశం అంటూ కొత్త రాగం ఎత్తుకొని మరోసారి ప్రజలను పక్క దారి పట్టిస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రం కోసం కేంద్ర ప్రభుత్వం కేటాయించిన నిధులు కనిపించడం లేదా అని ప్రశ్నించారు. ఈ విషయంపై భాజపా చర్చకు సిద్ధమని చెప్తే ఒక్క తెరాస నాయకుడు ముందుకు వచ్చే ధైర్యం లేక తోక ముడుచుకున్నారని ఎద్దేవా చేశారు. తండ్రి కొడుకులకు ఓటమి భయం పట్టుకుందని.. ఏదో విధంగా మరోసారి అధికారం దక్కించుకునేందుకు రోజుకో కొత్త వేషం వేస్తున్నారని డీకే అరుణ విమర్శించారు. మళ్లీ మోదీ అధికారంలోకి వస్తే.. ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాలు కలిపేస్తారని మాట్లాడటం సిగ్గు చేటన్నారు. అసలు భాజపా తెలంగాణ బిల్లుకు మద్దతు ఇవ్వకపోతే.. కాంగ్రెస్ బిల్లు పెట్టగలిగేదో లేదో తెలుసుకుంటే మంచిదని హితవు పలికారు.

ఇదీ చదవండి:union electricity minister: "విద్యుత్‌ మీటర్లపై కేసీఆర్‌ పూర్తిగా అబద్ధాలు చెప్పారు"

ABOUT THE AUTHOR

...view details