నిర్భయ ఘటన తర్వాత మళ్లీ ఆ స్థాయిలో దేశం మొత్తాన్ని కదిలించింది దిశ సంఘటన. దిశ ఘటనలో ఒకడైన నిందితుడు చెన్నకేశవులు భార్య ఆ సమయంలో గర్భంతో ఉన్న విషయం విదితమే. తాజాగా ఆమె ఆడబిడ్డకు జన్మనిచ్చింది. దీనిపై స్పందించిన ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ ట్వీట్ చేశాడు.
'చెన్నకేశవులు భార్య రేణుక ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ప్రస్తుతం ఇద్దరూ క్షేమంగా ఉన్నారు. కానీ రేపిస్టుల నీడ వారిపై పడకుండా ఉండాలంటే.. దయచేసి మీకు తోచిన సాయం చేయండి'అని ట్విట్టర్‌లో పేర్కొన్నాడు. స్వచ్ఛంద సంస్థ ఆశా అకౌంట్ నంబర్, వివరాలను కూడా ఆయన షేర్ చేశారు.