హైదరాబాద్ నాంపల్లిలోని శ్రీ పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ ఆడిటోరియంలో ఇనుప మేకులపై చేసిన నృత్య ప్రదర్శన అందరినీ అలరించింది. అవని నృత్యాలయం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో నృత్యకారిణి నిఖిత ఈ ప్రదర్శన ఇచ్చారు. ఇందుకు నాట్యాచార్యులు డా.రవికుమార్ నిఖితకు శిక్షణ ఇచ్చారు.
నవదుర్గ అంశంపై తొమ్మిది శ్లోకాలకు తొమ్మిది నిమిషాల పాటు 9,999 ఇనుప మేకులపై నిఖిత చేసిన నృత్యం వీక్షకులను ఆశ్చర్యపరిచింది. ఈ ప్రదర్శనకు గానూ నృత్యకారిణి నిఖితకు పది అవార్డులు దక్కాయి. యువత.. మన సంప్రదాయ నృత్యాలపై ఆసక్తి చూపాలని... అప్పుడే మన సంస్కృతి భావితరాలకు అందిచగల్గుతామని నిఖిత తెలిపింది. ఈ కార్యక్రమంలో పలువురు నృత్య గురువులు, విద్యార్థులు పాల్గొన్నారు.