తెలంగాణ

telangana

ETV Bharat / city

'ఆరింటి నుంచి అర్ధరాత్రి మధ్యే ఎక్కువ ప్రమాదాలు'

ఆరింటి నుంచి అర్ధరాత్రి మధ్యే ఎక్కువ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని సైబరాబాద్​ సీపీ సజ్జనార్​ తెలిపారు. నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేయడం, ట్రాఫిక్ నిబంధనలు పాటించకపోవడం వల్ల తరచూ ప్రమాదాలు చోటు చేసుకుంటున్నట్లు పేర్కొన్నారు.

cyberabad cp sajjanar on accidents
cyberabad cp sajjanar on accidents

By

Published : Dec 23, 2020, 9:40 PM IST

రహదారి ప్రమాదాలు సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 12గంటల మధ్య ఎక్కువగా జరుగుతున్నట్లు సైబరాబాద్ సీపీ సజ్జనార్ తెలిపారు. అతివేగం, మద్యం సేవించడం, డ్రైవింగ్ లైసెన్సు లేనివాళ్లు వాహనాలు నడపడం, సరైన నైపుణ్యం లేనివాళ్లు వాహనాలు నడపడం ప్రమాదాలకు కారణమవుతోందని సజ్జనార్ తెలిపారు. రహదారి ప్రమాదాలపై అవగాహన కల్పించేందుకు నిర్వహించిన ఓ చర్చా కార్యక్రమంలో ట్రాఫిక్ డీసీపీ విజయ్ కుమార్​తో కలిసి సజ్జనార్ పాల్గొన్నారు.

నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేయడం, ట్రాఫిక్ నిబంధనలు పాటించకపోవడం వల్ల తరచూ ప్రమాదాలు చోటు చేసుకుంటున్నట్లు ట్రాఫిక్ డీసీపీ విజయ్ కుమార్ తెలిపారు. ప్రమాదాల్లో 55శాతం మంది ద్విచక్ర వాహనదారులే ఉంటున్నట్లు డీసీపీ విజయ్ కుమార్ తెలిపారు. ప్రమాదాల నివారణకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని... వాహనదారులు పోలీసులకు సహకరించాలని విజయ్ కుమార్ కోరారు.

ఇదీ చూడండి: ఈనెల 31కు ఓటుకు నోటు కేసు విచారణ వాయిదా

ABOUT THE AUTHOR

...view details