ప్రజానాట్యమండలి కళాకారుడు, జాతీయ సమితి సభ్యుడు జాకబ్ మృతి పట్ల సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి తీవ్ర విచారాన్ని వ్యక్తం చేశారు. బొల్లారంలోని జాకబ్ కూతురు నివాసానికి వెళ్లి ఆయన పార్థివదేహానికి నివాళులర్పించారు. జాకబ్ విద్యార్థి నాయకుడి నుంచి జాతీయ నాయకుడిగా ఎదిగారని గుర్తు చేసుకున్నారు.
ఇటీవల జరిగిన సీపీఐ జాతీయ సమితి సమావేశంలో రైతు వ్యతిరేక వ్యవసాయ చట్టాలను నిరసిస్తూ.. నాటికను ప్రదర్శించారన్నారు. నిబద్ధత, నిజాయతీ కలిగిన కళాకారుడిని ప్రజానాట్యమండలి కోల్పోయిందని.. అతని మృతి తీరని లోటని అన్నారు. జాకబ్ మృతికి తెలంగాణ రాష్ట్ర సమితి తరఫున సంతాపం ప్రకటించారు. వారి కుటుంబ సభ్యులకు సానుభూతిని తెలిపారు.