తెలంగాణ

telangana

ETV Bharat / city

అంతరిక్ష రంగాన్ని సైతం ప్రైవేటీకరించడం ప్రమాదకరం: సీపీఐ - chada venkat reddy latest news

లాభాల బాటలో నడుస్తున్న ప్రభుత్వరంగ సంస్థలను ప్రైవేటీకరించడం దారుణమని సీపీఐ తెలుగు రాష్టాల కార్యదర్శులు చాడ వెంకట్ రెడ్డి, రామకృష్ణ అన్నారు. హైదరాబాద్​లోని సీపీఐ రాష్ట్ర కార్యలయం ఎదుట వారు నిరసన తెలిపారు.

cpi-protest-on-public-sector-privatization-at-himayatnagar-hyderabad
పబ్లిక్‌ రంగాన్ని ప్రైవేట్‌ పరం చేయొద్దు‌: చాడ, రామకృష్ణ

By

Published : Jul 9, 2020, 5:02 PM IST

కరోనాతో ప్రజలు అల్లాడుతుంటే ప్రధాని మోదీ... ప్రభుత్వ రంగాన్ని ప్రైవేటుకు అప్పగించడం దారుణమని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి అన్నారు. ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా హైదరాబాద్ హిమాయత్‌నగర్‌లోని సీపీఐ కార్యాలయం ఎదుట నిరసన చేపట్టారు. సీపీఐ ఆంధ్రప్రదేశ్​ కార్యదర్శి రామకృష్ణతో కలిసి చాడ ఆందోళనలో పాల్గొన్నారు. లాభాల బాటలో నడుస్తున్న ప్రభుత్వరంగ సంస్థలను... పబ్లిక్ రంగాన్ని నిర్వీర్యం చేసి కార్పొరేట్ సంస్థలకు అప్పగించడం సరికాదన్నారు.

చివరకు అంతరిక్ష రంగాన్ని కూడా ప్రవేటు పరం చేయడం దారుణమైన చర్యగా సీపీఐ ఏపీ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అభివర్ణించారు. ఈ నిర్ణయాన్ని శాస్త్రవేత్తలు, మేధావులు, అన్ని రాజకీయ పార్టీలు వ్యతిరేకిస్తున్నప్పటికీ ప్రధాని పట్టించుకోకుండా... ఏకపక్షంగా నిర్ణయం తీసుకోవడం ఎంతవరకూ సబబని ప్రశ్నించారు. తక్షణమే ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో దేశవ్యాప్త ఆందోళనలకు శ్రీకారం చూడతామని చాడ, రామకృష్ణ హెచ్చరించారు.

పబ్లిక్‌ రంగాన్ని ప్రైవేట్‌ పరం చేయొద్దు‌: చాడ, రామకృష్ణ

ఇదీ చూడండి:నిమ్స్​లో వైద్య సిబ్బంది ఆందోళన... నిలిచిన ఓపీ సేవలు

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details