ఆంధ్రప్రదేశ్‌లో కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. రోజురోజుకూ వైరస్ బారిన పడుతున్న బాధితుల సంఖ్యతో పాటు మృతుల సంఖ్య సైతం పెరుగుతోంది. గడిచిన 24 గంటల వ్యవధిలో 62,885 పరీక్షలు నిర్వహించగా.. 12,634 కేసులు నిర్ధరణ అయ్యాయి. 69 మంది ప్రాణాలు కోల్పోయారు. తాజా కేసులతో కలిపి ఇప్పటివరకు ఆంధ్రప్రదేశ్‌లో 10,33,560 మంది వైరస్ బారినపడినట్లు ఆ రాష్ట్ర వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఇప్పటివరకు 1,59,31,722 నమూనాలను ఆరోగ్య శాఖ పరీక్షించింది.
కొవిడ్‌తో కృష్ణా జిల్లాలో అత్యధికంగా 12 మంది ప్రాణాలు కోల్పోయారు. నెల్లూరులో ఏడుగురు; తూర్పు గోదావరి, శ్రీకాకుళం, విశాఖ, పశ్చిమ గోదావరిలో ఆరుగురు చొప్పున; అనంతపురం, కడప ఐదుగురు చొప్పున; చిత్తూరు, గుంటూరులో నలుగురేసి; ప్రకాశం, విజయనగరంలో ముగ్గురు చొప్పున; కర్నూలులో ఇద్దరు మరణించారు. ఇప్పటి వరకు 7,685 మంది మృతి చెందారు.