ఏపీలో తిరుమల మహా పాదయాత్రలో సొమ్మసిల్లి పడిపోయిన ఇద్దరిని.. అక్కడ విధుల్లో ఉన్న కానిస్టేబుల్ షేక్ అర్షద్... దాదాపు 6 కిలోమీటర్ల దూరం దట్టమైన అడవి మార్గంలో భుజాలపై మోసుకుని వెళ్లారు. కాలి నడకన తిరుమలకు బయలుదేరిన నాగేశ్వరమ్మ... 'గుర్రపు పాదం' వద్ద హైబీపీతో కళ్ళు తిరిగి సొమ్మసిల్లి పడిపోయింది.
శెభాష్ అర్షద్: సొమ్మసిల్లిన మహిళను కాపాడిన కానిస్టేబుల్
ఏపీలోని తిరుమలలో పాదయాత్రలో సొమ్మసిల్లి పడిపోయిన ఇద్దరిని కానిస్టేబుల్ అర్షద్ కాపాడారు. దాదాపు 6 కిలోమీటర్ల దూరం భుజాలమీద మోసుకెళ్లి శెభాష్ అనిపించుకున్నారు. సమయస్ఫూర్తితో వ్యవహరించిన కానిస్టేబుల్కు సర్వత్రా అభినందనలు వెల్లువెత్తున్నాయి.
సొమ్మసిల్లిన మహిళను కాపాడిన కానిస్టేబుల్
ఆమెను గమనించిన కానిస్టేబుల్ అర్షద్.. పెద్ద సాహసమే చేశారు. 6 కిలోమీటర్లపాటు భుజాలపై మోసుకెళ్లి ఆస్పత్రిలో చేర్పించారు. అంతకుముందు నాగేశ్వరరావు అనే వృద్ధుడిని సైతం ఇలాగే భుజాలపైనే మోసుకెళ్లారు. ఇద్దరి ప్రాణాలు కాపాడిన కానిస్టేబుల్ సమయస్ఫూర్తికి సర్వత్రా అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.
ఇదీ చదవండి :ప్రజల మన్ననలందుకుంటోన్న జమ్మికుంట ఠాణా