కేంద్రం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు ఈ నెల 8న తలపెట్టిన భారత్‌బంద్‌కు తెరాస సంపూర్ణ మద్దతు తెలిపింది. ఈ మేరకు ముఖ్యమంత్రి కేసీఆర్ వెల్లడించారు. తెరాస శ్రేణులు ప్రత్యక్షంగా ఈ బంద్‌లో పాల్గొంటారని ఆయన తెలిపారు.
రైతులది న్యాయపోరాటం.. భారత్‌బంద్‌కు మద్దతుగ నిలుస్తం: కేసీఆర్
ఈ నెల 8న రైతులు తలపెట్టిన భారత్ బంద్‌కు తెరాస సంపూర్ణ మద్దతు ప్రకటించింది. తెరాస శ్రేణులు బంద్‌లో ప్రత్యక్షంగా పాల్గొంటారని కేసీఆర్ స్పష్టం చేశారు.
రైతుల పోరాటానికి సీఎం కేసీఆర్ మద్దతు
కేంద్రం తెచ్చిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు న్యాయమైన పోరాటం చేస్తున్నారని కేసీఆర్ వారిని సమర్థించారు. ఈ చట్టాలు రైతుల ప్రయోజనాలను దెబ్బతీసే విధంగా ఉన్నందు వల్లే తెరాస వాటిని పార్లమెంటులో వ్యతిరేకించిందని సీఎం గుర్తుచేశారు.
నూతన వ్యవసాయ చట్టాలను ఉపసంహరించుకునే వరకూ పోరాటం కొనసాగించాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. భారత్‌బంద్ విజయవంతానికి తెరాస కృషి చేస్తుందని పేర్కొన్నారు. రైతులకు అండగా నిలవాలని సీఎం కేసీఆర్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
- ఇదీ చూడండి :రైతు దీక్ష: దిల్లీ సరిహద్దుల్లో కర్షకుల ఆందోళన
Last Updated : Dec 6, 2020, 7:42 PM IST