తెలంగాణ

telangana

ETV Bharat / city

పచ్చదనం లేకుంటే పదవుల నుంచి తొలగింపు - cm kcr

పట్టణాలు, పల్లెల్లో గ్రీన్​కవర్​ పాలసీ తీసుకువస్తున్నామని ముఖ్యమంత్రి కేసీఆర్​ స్పష్టం చేశారు. కలెక్టర్​ ఆధ్వర్యంలో గ్రీన్​ కమిటీ ఏర్పాటు చేసి, కమిటీ ద్వారా సర్వే చేయించి అవసరమైన చర్యలు చేపడతామని తెలిపారు.

cm kcr says seviour action will be taken against leaders and officers who fail to keep greenary and fail to protect trees in villages and cities

By

Published : Jul 19, 2019, 12:18 PM IST

పచ్చదనం లేకుంటే పదవుల నుంచి తొలగింపు

హరితహారం లక్ష్యాలు పూర్తి చేయని ప్రజాప్రతినిధులపై కఠిన చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. హరితహారం విషయంలో బాధ్యతలు సక్రమంగా నిర్వర్తించని అధికారులను ఉద్యోగం నుంచి తొలగిస్తామని హెచ్చరించారు. మొక్కలు నాటి సంరక్షించని సర్పంచ్, ఛైర్​పర్సన్​లు పదవులు కోల్పోతారని నూతన చట్టంతో ఈ విధానం అమల్లోకి వస్తుందని తెలిపారు. అడవులు పెరిగి, రాష్ట్రం పచ్చదనంతో పరిఢవిల్లాలని ఆకాంక్షించారు. మూడేళ్లలో రాష్ట్రంలో అద్భుతం జరుగుతుందన్నారు.

ABOUT THE AUTHOR

...view details