రాష్ట్రంలో మళ్లీ పెరుగుతున్న కరోనా కేసుల విషయంలో ప్రభుత్వానికి ఆందోళన ఉందని సీఎం కేసీఆర్ తెలిపారు. పాఠశాలల్లోనే ఎక్కువ కరోనా కేసులు రావటం పట్ల ముఖ్యమంత్రి ఆవేదన వ్యక్తం చేశారు.
' పాఠశాలల కొనసాగింపుపై సభలోనే ప్రకటిస్తా'
రాష్ట్రంలోని పాఠశాలల్లో నమోదవుతున్న కరోనా కేసులపై ముఖమమంత్రి కేసీఆర్ ఆందోళన వ్యక్తం చేశారు. కేసులు పెచ్చరిల్లుతున్న వేళ... విద్యార్థులను కాపాడుకునేందుకు త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు. ఆ నిర్ణయాన్ని కూడా సభలోనే ప్రకటిస్తామన్నారు.
cm kcr comments on corona cases in schools
విద్యార్థులపై మహమ్మారి ప్రతాపం చూపుతున్న నేపథ్యంలో... తరగతులు కొనసాగించాలో... సెలవులు ఇవ్వాలో ఓ నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు. పాఠశాలల విషయంలో నిర్ణయాన్ని సభలోనే ప్రకటిస్తామని సీఎం తెలిపారు.