రాష్ట్రమంతా విషజ్వరాలతో మగ్గుతుంటే... ముఖ్యమంత్రి, వైద్యారోగ్య మంత్రికి కనబడకపోవడం దారుణమని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు. తెరాసలో ఓనర్ పంచాయతీలో పడి పాలనను పట్టించుకోవడం లేదని ఎద్దేవా చేశారు. ప్రభుత్వ దావఖానాల్లో మంచాలు, మందులు, సరైన సౌకర్యాలు లేక రోగులు నానా అవస్థలు పడుతుంటే... మంత్రి ఈటల రాజేందర్ అన్ని బాగున్నాయనడం సరికాదన్నారు. సమస్యలు గుర్తించి ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చినా... స్పందన లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
సీఎం, మంత్రి కళ్లకు గంతలు కట్టుకున్నారా? సీఎల్పీ నేత భట్టి - eetela
రాష్ట్రంలో ఆరోగ్య పరిస్థితి దయనీయంగా ఉంటే... సీఎం, వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి కళ్లకు గంతలు కట్టుకున్నారని అని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ప్రశ్నించారు.

రాష్ట్రంలో ఆరోగ్య పరిస్థితి దారుణం: భట్టి