తెలంగాణ

telangana

By

Published : Nov 28, 2021, 5:00 PM IST

ETV Bharat / city

CBN letter to CS: ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే అన్నమయ్య ప్రాజెక్టు కొట్టుకుపోయింది: చంద్రబాబు

Chandrababu letter to CS: తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు... ఏపీ సీఎస్ సమీర్ శర్మకు లేఖ రాశారు. వరదల్లో ప్రభుత్వ వైఫల్యంపై న్యాయ విచారణకు డిమాండ్ చేశారు. వరదల కారణంగా చనిపోయిన వారి కుటుంబాలకు 25 లక్షలు, మిగిలిన బాధిత కుటుంబాలకు 2 లక్షల పరిహారం ఇవ్వాలని చంద్రబాబు డిమాండ్ చేశారు.

chandrababu letter
ఏపీ సీఎస్ సమీర్ శర్మకు చంద్రబాబు లేఖ

Chandrababu letter to CS : వరదల్లో రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యంపై న్యాయ విచారణకు... తెలుగుదేశం అధినేత చంద్రబాబు(tdp chief chandrababu) డిమాండ్ చేశారు. ఈమేరకు సీఎస్ సమీర్ శర్మకు లేఖ)cbn letter to AP CS) రాశారు. ప్రభుత్వం, అధికారుల నిర్లక్ష్యం వల్లే అన్నమయ్య ప్రాజెక్టు కొట్టుకుపోయిందని ఆరోపించారు. తుమ్మలగుంట చెరువును ఆట స్థలంగా మార్చడం వల్లే... తిరుపతి నగరాన్ని వరదలు ముంచెత్తాయని మండిపడ్డారు. కడప, చిత్తూరు, నెల్లూరు, అనంతపురం జిల్లాల్లో వరదలతో భారీ ప్రాణ నష్టంతోపాటు... ఆస్తి, పంట నష్టం సంభవించాయని ఆవేదన చెందారు. రోడ్లు, వంతెనలతోపాటు విద్యుత్, కమ్యూనికేషన్ వ్యవస్థలు దారుణంగా దెబ్బతిన్నాయని లేఖలో ప్రస్తావించారు.

వరద తగ్గి చాలా రోజులైనా ఇప్పటికీ బాధితులు తిండి, నీళ్లు లేక అల్లాడుతున్నారని... మరికొందరికి కనీసం తల దాచుకునే వసతి లేక రోడ్ల మీదే ఉన్నారన్నారు. వరదల కారణంగా చనిపోయిన వారి కుటుంబాలకు 25 లక్షలు, మిగిలిన బాధిత కుటుంబాలకు 2 లక్షల పరిహారం ఇవ్వాలని చంద్రబాబు(chandrababu demands ex gratia for flood deaths) డిమాండ్ చేశారు. ఇళ్లు కోల్పోయిన వారికి ఇళ్లు కట్టివ్వాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వ అంచనాల ప్రకారమే 6 వేల 54 కోట్ల నష్టం జరిగితే... బాధిత ప్రాంతాలకు కేవలం 35 కోట్లు విడుదల చేయడం ఏంటని ప్రశ్నంచారు. ప్రకృతి వైపరీత్యాల కోసం ఖర్చు చేయాల్సిన 11వందల కోట్ల నిధులను రాష్ట్ర ప్రభుత్వం మళ్లించిందని కాగ్ తప్పు పట్టిన విషయాన్ని లేఖలో ప్రస్తావించారు. నిధుల మళ్లింపు జాతీయ ప్రకృతి విపత్తుల నిర్వహణ నిబంధనలకు విరుద్ధమన్నారు.

వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన చంద్రబాబు

ఏపీలో వరదల కారణంగా అతలాకుతమైన ప్రాంతాల్లో తెదేపా అధినేత చంద్రబాబు(cbn visit in flood affected areas) పర్యటించారు. వరద బాధితులను పరామర్శించి వారికి అందించాల్సిన సాయంపై ఆరా తీశారు. ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ తరఫున(NTR memorial trust) వరదల్లో మృతి చెందిన వారికి, బాధిత కుటుంబాలకు సాయం ప్రకటించారు. కడప, నెల్లూరు, చిత్తూరు జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఆయన సుడిగాలి పర్యటన చేశారు. వరద బాధితులకు తక్షణమే ఆర్థిక సాయం అందజేయాలని డిమాండ్ చేశారు.

ప్రభుత్వంపై విమర్శలు

వరద బాధితులను ఆదుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. ప్రజలు వరద ముంపుతో అల్లాడుతుంటే కనీస సదుపాయాలు కల్పించలేదని ఆరోపించారు. ప్రజల సమస్యలను గాలికొదిలేశారని మండిపడ్డారు. వైకాపా నేతలు కేవలం మాటలకే పరిమితమయ్యారని చంద్రబాబు ధ్వజమెత్తారు.

ఇదీ చదవండి:

TDP Parliamentary meeting: 'వరదలను జాతీయ విపత్తుగా ప్రకటించాలి'

Chandrababu Naidu: నెల్లూరు జిల్లా వరద ముంపు ప్రాంతాల్లో చంద్రబాబు పర్యటన

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details