CAG on AP Debts : ఏపీలో అప్పుల పరంపర అలాగే కొనసాగుతోంది. రెవెన్యూ లోటు పెరుగుతూనే ఉంది. ఏడాది మొత్తానికి ఎంత రెవెన్యూ లోటు ఉంటుందని ఆర్థికశాఖ అధికారులు లెక్కించారో, అది కేవలం 2 నెలల్లోనే మించిపోయింది. 2022-23 ఆర్థిక సంవత్సరంలో మొత్తంగా రూ.17,036.15 కోట్లకు రెవెన్యూ లోటును సరిపెడతామని బడ్జెట్ ప్రతిపాదనల్లో పేర్కొన్నారు. చట్టసభలకు హామీనిచ్చారు. ఆ అంచనా కేవలం 2 నెలల్లోనే తప్పింది. ఈ ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్, మే నెలాఖరువరకు రాష్ట్ర ఆర్థిక లెక్కలను ప్రభుత్వం కాగ్‌కు సమర్పించింది. ఏడాది మొత్తానికి రెవెన్యూ రాబడికన్నా రెవెన్యూ ఖర్చు రూ.17,036.15 కోట్లు ఉంటుందని లెక్కిస్తే ఈ 2 నెలల్లోనే రెవెన్యూ లోటు రూ.21,924.85 కోట్లకు చేరింది. అంటే అంచనాతో పోలిస్తే ఇప్పటికే 128 శాతం రెవెన్యూ లోటు ఉందని పేర్కొంది.
ఏపీలో రాబడికన్నా రుణాలే అధికం, లెక్కలు తేల్చిన కాగ్
CAG on AP Debts ఏపీలో అప్పుల పరంపర అలాగే కొనసాగుతోంది. 2022-23 ఆర్థిక సంవత్సరంలో మొత్తంగా రూ.17,036.15 కోట్లకు రెవెన్యూ లోటును సరిపెడతామని బడ్జెట్ ప్రతిపాదనల్లో పేర్కొన్నారు. చట్టసభలకు హామీనిచ్చారు. ఆ అంచనా కేవలం 2 నెలల్లోనే తప్పింది. ఈ ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్, మే నెలాఖరువరకు రాష్ట్ర ఆర్థిక లెక్కలను ఏపీ ప్రభుత్వం కాగ్‌కు సమర్పించింది.
CAG on AP Debts
ఏ రాష్ట్రంలోనైనా, ఏ కుటుంబంలోనైనా రాబడి ఎక్కువ ఉండి అందులో అప్పులు కొద్ది శాతానికి పరిమితం కావాలి. అలాంటిది ప్రస్తుతం ఏపీలో కొత్త ఆర్థిక సంవత్సరంలోనూ రాబడిని మించి అప్పులు చేసే పరిస్థితి ఏర్పడింది. అన్ని రకాల ఆదాయాలు కలిసి రూ.17,975.28 కోట్లు వచ్చింది. అదే సమయంలో రూ.22,960.96 కోట్లు అప్పు తీసుకున్నారు. ఆ రెండు కలిపి మొత్తం రూ.39,900 కోట్లు ఖర్చు చేశారు. అదే సమయంలో మూలధన వ్యయమంటే ఆస్తులు సృష్టించేందుకు చేసిన ఖర్చు రూ.996 కోట్లు మాత్రమే.