తెలంగాణ

telangana

ETV Bharat / city

స్నేహితుల ప్రాణాలు కాపాడి.. తాను మృత్యు ఒడిలోకి!

ఐదుగురు స్నేహితులంతా కలిసి సరదాగా ఈతకు వెళ్లారు. ప్రమాదవశాత్తు వారిలో నలుగురు కొట్టుకుపోతుండగా...రవీంద్ర అనే యువకుడు వారందరినీ కాపాడాడు. ప్రవాహ ధాటికి రవీంద్ర పట్టు తప్పి ప్రాణాలు విడిచాడు. ఏపీలోని నెల్లూరు జిల్లా అనంతసాగరం మండలంలో ఈ విషాదం జరిగింది.

one youngman died in nellore
స్నేహితుల ప్రాణాలు కాపాడి.. తాను మృత్యు ఒడిలోకి!

By

Published : May 31, 2020, 1:04 PM IST

పెన్నా నదిలో సరదాగా ఈతకు వెళ్ళిన ఐదుగురు యువకులు నీటి ప్రవాహంలో చిక్కి విలవిల్లాడారు. వారిలో రవీంద్ర అనే యువకుడు ధైర్యం చేసి.. మిగతా నలుగురిని కాపాడాడు. చివరికి తానే పట్టు తప్పి నది ప్రహహంలో కోట్టుకుపోయి చనిపోయాడు. ఆంధ్ర ప్రదేశ్ నెల్లూరు జిల్లా అనంతసాగరం మండలం రెవూరులో ఎండ తీవ్రత తట్టుకోలేక.. నిత్యం పెన్నానదిలో యువకులు సరదగా ఈతకు వెళ్తుంటారు.

ఈ క్రమంలోనే ఈతకు వెళ్లి ప్రవాహంలో చిక్కుకున్నారు. ప్రమాద స్దలానికి చెరుకున్న పోలీసులు, పైర్ సిబ్బంది వారిని కాపాడే ప్రయత్నం చేశారు.. అప్పటికే నీటిప్రవాహంలో కోట్టుకుపోయిన రవీంద్రను ఆత్మకూరు మండలం అప్పారావు పాలెం దగ్గర గుర్తించినట్టు అధికారులు తెలిపారు.

ఇవీ చూడండి:విజృంభిస్తున్న కరోనా... ఆగమంటే ఆగేనా

ABOUT THE AUTHOR

...view details