తెలంగాణ

telangana

ETV Bharat / city

'తెరాస గెలిస్తే మజ్లిస్​ ఆగడాలు మితిమీరుతాయి' - జీహెచ్​ఎంసీ ఎన్నికలు 2020

హైదరాబాద్ పాతబస్తీ డబీర్​పురా వార్డులో భాజపా కార్యాలయాన్ని భాజపా ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్ ప్రారంభించారు. అనంతరం జంగంమెట్ డివిజన్​లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. పాతబస్తీ అభివృద్ధి చెందాలంటే... భాజపాను గెలిపించాలని కోరారు.

bjp leader laxman participated in ghmc election campaign in old city
bjp leader laxman participated in ghmc election campaign in old city

By

Published : Nov 24, 2020, 5:54 PM IST

'తెరాస గెలిస్తే మజ్లిస్​ ఆగడాలు మితిమీరుతాయి'

తెరాసతో ఎంఐఎం లోపాయకారి ఒప్పందం చేసుకుందని భాజపా ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్​ ఆరోపించారు. హైదరాబాద్ పాతబస్తీ డబీర్​పురా వార్డులో భాజపా కార్యాలయాన్ని లక్ష్మణ్ ప్రారంభించారు. అనంతరం జంగంమెట్ డివిజన్​లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు.

నగరంలో పాతబస్తీ ఎందుకు అభివృద్ధి చెందడం లేదని ప్రశ్నించారు. పొరపాటున జీహెచ్​ఎంసీ ఎన్నికల్లో మళ్లీ తెరాస గెలుస్తే... మజ్లిస్ ఆగడాలు మితిమీరే ప్రమాదం ఉందని అభిప్రాయపడ్డారు. గ్రేటర్​లో ఈసారి మేయర్ పీఠం భాజపాదేనని లక్ష్మణ్​ ధీమా వ్యక్తం చేశారు.

ఇదీ చూడండి: 'గ్రేటర్​లో కాషాయం జెండా ఎగరడం ఖాయం'

ABOUT THE AUTHOR

...view details