కొవిడ్ టీకా అభివృద్ధి ప్రయాణం అనేక సవాళ్లను విసిరిందని బయోలాజికల్-ఈ ఎండీ, సీఈఓ మహిమ దాట్ల తెలిపారు. ఈ సవాళ్లను అధిగమించి కార్బీ టీకాను అభివృద్ధి చేశామని చెప్పారు. కొవిడ్‌పై పోరులో భాగస్వామ్యులు కావడం సంతృప్తినిస్తోందని అన్నారు. తమ సంస్థ పిల్లల కోసమే అనేక వ్యాక్సిన్లు అభివృద్ధి చేసిందని... పిల్లలకు టీకాల అభివృద్ధిలో విజయవంతమైన చరిత్ర ఉందని వివరించారు. 12నుంచి 18ఏళ్ల పిల్లలకు క్లీనికల్ ట్రయల్స్ నిర్వహించామని పేర్కొన్నారు. 5 నుంచి 12ఏళ్ల చిన్నారుల్లోనూ క్లీనికల్ ట్రయల్స్ చేసినట్లు వెల్లడించారు. తల్లిదండ్రులు, నిపుణుల అంగీకారంతోనే ట్రయల్స్ నిర్వహించినట్లు స్పష్టం చేశారు.
'కార్బీవ్యాక్స్ సమర్థత విషయంలో ఎలాంటి అనుమానాలు అవసరం లేదు'
కొవిడ్ విసిరిన అనేక సవాళ్లను అధిగమించి పిల్లల కోసం కార్బీ వ్యాక్స్ టీకాను అభివృద్ధి చేసినట్లు బయోలాజికల్-ఈ ఎండీ, సీఈఓ మహిమ దాట్ల తెలిపారు. వ్యాక్సిన్ అభివృద్ధిలో విజయవంతమైన చరిత్ర తమకు ఉందన్న ఆమె... కార్బీవ్యాక్స్ సమర్థత విషయంలో ఎలాంటి అనుమానాలు అవసరం లేదని తెలిపారు. దాదాపు 3 వేల మందిపై క్లినికల్ ట్రయల్స్ నిర్వహించినట్టు పేర్కొన్నారు. వ్యాక్సిన్ తయారీలో అన్ని నిబంధనలు పాటించామంటున్న మహిమ దాట్లతో ఈటీవీ భారత్ ప్రతినిధి రమ్య ముఖాముఖి.
'క్లీనికల్ ట్రయల్స్ పూర్తి సమాచారం మా వైబ్‌సైట్‌లో ఉంది. సైట్‌లోని సమాచారాన్ని చూసి వివరాలు సరిచూసుకోవచ్చు. హైపటైటిస్-బి వ్యాక్సిన్ పరిజ్ఞానాన్నే కొవిడ్ టీకాలో ఉపయోగించాం. ఐదేళ్లలో 3బిలియన్ల డోసుల హైపటైటిస్-బి వ్యాక్సిన్లు పంపిణీ చేశాం. టీకాల రక్షణ విధానాల్లో విజయవంతమైన చరిత్ర ఉంది. బూస్టర్ డోసు క్లీనికల్ ట్రయల్స్ కొనసాగుతున్నాయి. కార్బె వ్యాక్సిన్ అనుమతికి డబ్ల్యూహెచ్‌ఓకు దరఖాస్తు చేశాం. డబ్ల్యూహెచ్‌ఓకు నుంచి అనుమతి వస్తుందని విశ్వాసం ఉంది.' - మహిమ దాట్ల, బయోలాజికల్-ఈ ఎండీ, సీఈఓ
ఇదీ చూడండి: