ఏపీలో రాష్ట్ర పారిశ్రామిక విధానాన్ని ప్రభుత్వం ప్రకటించింది. 2020-23 సంవత్సరాలకు నూతన పారిశ్రామిక విధానాన్ని ఖరారు చేస్తూ వివరాలను వెల్లడించింది. పారిశ్రామిక అనుమతుల వేగవంతానికి వైఎస్‌ఆర్ ఏపీ వన్ పేరిట సింగిల్ విండో కేంద్రం పేరిట పాలసీ నిర్ణయం చేసినట్లు స్పష్టం చేసింది. ఈ మేరకు సింగిల్ విండో కేంద్రాన్ని పరిశ్రమల శాఖ ఏర్పాటు చేసింది. నూతన పాలసీని మంత్రి గౌతమ్‌రెడ్డి, ఏపీఐఐసీ ఛైర్ పర్సన్ రోజా విడుదల చేశారు.
'వైఎస్‌ఆర్ ఏపీ వన్' పేరిట ఏపీ నూతన పారిశ్రామిక విధానం - ఏపీ నూతన పారిశ్రామిక విధానం

11:52 August 10
'వైఎస్‌ఆర్ ఏపీ వన్' పేరిట ఏపీ నూతన పారిశ్రామిక విధానం
సమర్ధ వినియోగమే లక్ష్యం...
విస్తృతమైన వనరుల సమర్ధ వినియోగమే లక్ష్యంగా ఈ ప్రతిపాదనను ఆమోదించినట్లు పేర్కొంది. ఫలితంగా భారీ నుంచి సూక్ష్మ స్థాయి పరిశ్రమకు సమాన అవకాశాలు లభించనున్నట్లు వివరించింది. లీజు కమ్ బై అవుట్ ప్రాతిపదికన భూముల కేటాయింపులు చేపడతామని స్పష్టం చేసింది. ఇందుకోసమే ప్రమాద రహిత పారిశ్రామిక వ్యవస్థలనూ ఏర్పాటు చేస్తూ ఆదేశాలు జారీ చేసింది.
ఇవీ చూడండి : రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై సీఎస్‌తో కేంద్ర బృందం సమావేశం