ఆంధ్రప్రదేశ్‌లో మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో మార్చి 10వ తేదీన ఏపీ రాష్ట్రవ్యాప్తంగా 12 మున్సిపల్ కార్పొరేషన్లు, 75 మున్సిపాలిటీలు, నగర పంచాయతీల పరిధిలో సెలవు ప్రకటించాల్సిందిగా జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ అయ్యాయి. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులను ఆ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్ జారీ చేశారు.
ఏపీలో మార్చి 10న సెలవు దినం.. సీఎస్ ఆదిత్యనాథ్ ఆదేశం
ఆంధ్రప్రదేశ్‌లో మార్చి 10న మున్సిపల్ ఎన్నికలు జరుగుతున్న ప్రాంతాల్లో సెలవు దినంగా ప్రకటించాలంటూ కలెక్టర్లను ఆ రాష్ట్ర సీఎస్ ఆదేశించారు. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులు ఆయన జారీ చేశారు.
ఏపీలో మార్చి 10న సెలవు దినం.. సీఎస్ ఆదిత్యానాథ్ ఆదేశం
మరోవైపు పోలింగ్‌తో పాటు 14న కౌంటింగ్ జరగనున్న దృష్ట్యా ప్రభుత్వ భవనాలు, పాఠశాల భవనాలను వినియోగించుకునేందుకు వీలుగా ఏర్పాట్లు చేయాలని సీఎస్ స్పష్టం చేశారు. ఆయా రోజుల్లో సదరు ప్రభుత్వ కార్యాలయాలకు కూడా సెలవు ప్రకటించాలని సూచిస్తూ ఆయన ఉత్తర్వులు ఇచ్చారు.
ఇదీ చదవండి:'ఓటుకు నోటు కేసులో సీడీలు, హార్డ్ డిస్కులు సమర్పించండి'