ఏపీలోని నెల్లూరు జిల్లా కృష్ణపట్నంలో ఆనందయ్య (Anandaiah) మందు తయారీకి ఏర్పాట్లు జరుగుతున్నాయి. అధికారుల సూచనతో.. ఔషధం తయారు చేయడానికి ఆనందయ్య బృందం సిద్ధమైంది. వనమూలికలు, ముడి పదార్థాల సేకరణలో నిమగ్నమైంది. పంపిణీ ప్రకటించేవరకు ఇతరులెవరూ గ్రామంలోకి రావద్దని ఆనందయ్య (Anandaiah) తెలిపారు.
Anandaiah Medicine : ఆనందయ్య ఔషధం తయారీకి ముమ్మర ఏర్పాట్లు! - కృష్ణపట్నం ఆనందయ్య ఔషధం
ఏపీలోని కృష్ణపట్నంలో ఆనందయ్య (Anandaiah) మందు తయారీకి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ప్రభుత్వాధికారుల సూచనతో... ఆనందయ్య బృందం ఔషధం తయారీకి సన్నాహాలు చేస్తోంది.

ఆనందయ్య ఆయుర్వేద మందు, ఆనందయ్య మందుకు ఏర్పాట్లు, కృష్ణపట్నం ఆనందయ్య
తొలి ప్రాధాన్యత సర్వేపల్లి నియోజకవర్గానికేనన్న ఆనందయ్య.. పంపిణీ వేళ కొవిడ్ నిబంధనలు పాటించాలని అందరినీ కోరారు. మరోవైపు.. కృష్ణపట్నం పంచాయతీ పరిధిలో 144 సెక్షన్ కొనసాగిస్తున్నారు. కృష్ణపట్నం, గోపాలపురం వద్ద చెక్‌పోస్టులు పెట్టడంతోపాటు.. పటిష్ఠ బందోబస్తు కోసం పోలీసులు పికెటింగ్ నిర్వహిస్తున్నారు.