గ్రేటర్ హైదరాబాద్ మేయర్ పదవిని యాదవ కార్పొరేటర్‌కు కేటాయించాలని అఖిల భారత యాదవ మహాసభ గ్రేటర్ శాఖ కోరింది. హైదరాబాద్ వీఎస్టీ రోడ్డులోని ఆర్టీసీ కళ్యాణ మండపంలో మహాసభ ఆధ్వర్యంలో జీహెచ్ఎంసీ ఎన్నికల్లో విజయం సాధించిన 12 మంది యాదవ కార్పొరేటర్లకు సన్మానం జరిగింది.
రాష్ట్ర ప్రభుత్వం యాదవ కమ్యూనిటీకి అత్యధిక ప్రాధాన్యత ఇచ్చిందని రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్య తెలిపారు. బడుగు బలహీన వర్గాలకు రాజకీయంగా సమున్నత స్థానం కల్పించి.. వారి సంక్షేమం కోసం ముఖ్యమంత్రి అనేక పథకాలను అమలు చేస్తున్నారని కొనియాడారు.