ఆంధ్రప్రదేశ్లోని విజయనగరం జిల్లా భోగాపురం మండలం చేపలకంచేరుకు చెందిన నూకమ్మ, రాము దంపతులు. మత్స్యకార కుటుంబానికి చెందిన వీరికి మూడేళ్ల క్రితం వివాహమైంది. ఇంతకాలం పిల్లలు లేరని బాధపడ్డ ఈ దంపతులకు... ఒకే కాన్పులో ముగ్గురు పిల్లలు పుట్టారు. అదీ అమ్మాయిలే కావడం విశేషం.
నిజంగా ఆశ్చర్యమే...!
సంతానం కోసం ఈ దంపతులు ఇన్నాళ్లూ ఆస్పత్రుల చుట్టూ తిరిగారు. చివరకు ఎదురు చూపులు ఫలించి నూకమ్మ గర్భం దాల్చింది. ఈ నెల 9న విజయనగరంలోని వెంకటపద్మ ఆసుపత్రిలో ప్రసవం కోసం చేరింది. ముగ్గురు ఆడపిల్లలకు జన్మనిచ్చింది. చిన్నారులు తక్కువ బరువు ఉండడం వల్ల ప్రస్తుతం వారిని ప్రత్యేక వైద్య విభాగంలో ఉంచి చికిత్స అందిస్తున్నట్లు వైద్యులు తెలిపారు. ఇలాంటి ఘటనలు నిజంగా ఆశ్చర్యమేనని వైద్యులు వెంకటేశ్వర్రావు చెప్పారు.