తెలంగాణ

telangana

ETV Bharat / city

ఏపీలో కొత్తగా 667 కరోనా కేసులు..9 మరణాలు

ఏపీలో కొత్తగా 667 కరోనా కేసులు నమోదయ్యాయి. ఫలితంగా మొత్తం కేసుల సంఖ్య 8,71,972కు చేరింది. తాజాగా మరో 9 మంది మృతి చెందినట్లు వైద్యారోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులెటిన్ లో పేర్కొంది.

ఏపీలో కొత్తగా 667 కరోనా కేసులు..9 మరణాలు
ఏపీలో కొత్తగా 667 కరోనా కేసులు..9 మరణాలు

By

Published : Dec 6, 2020, 8:03 PM IST

ఏపీలో గడిచిన 24 గంటల్లో 60,329 కరోనా పరీక్షలు నిర్వహించగా.. 667 మందికి కరోనా నిర్ధరణ అయింది. తొమ్మిది మంది బాధితులు ప్రాణాలు కోల్పోయారు. ఈ మేరకు వైద్యారోగ్య శాఖ బులెటిన్‌ విడుదల చేసింది. ఇప్పటివరకు ఏపీలో నమోదైన కరోనా కేసుల సంఖ్య 8,71,972కు చేరింది. గడిచిన 24 గంటల్లో 914 మంది బాధితులు పూర్తిగా కోలుకోగా.. ఇప్పటివరకు కోలుకొని 8,59,029 మంది ఇళ్లకు వెళ్లిపోయారు.

తాజా మరణాలతో కలిపి 7,033 మంది కొవిడ్‌తో మృతి చెందారు. ఏపీ వ్యాప్తంగా 5,910 యాక్టివ్‌ కేసులున్నట్లు ఆరోగ్య శాఖ తెలిపింది. ఇప్పటివరకు 1,04,10,612 కరోనా పరీక్షలు నిర్వహించినట్లు పేర్కొంది.

ఇదీ చూడండి:బంద్​కు మద్దతు​.. మేం వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకం : కేటీఆర్

ABOUT THE AUTHOR

...view details