ఏపీలో కరోనా తాజా బులెటిన్ విడుదలైంది. రాష్ట్రానికి చెందిన 253 మంది.. కరోనా బారిన పడ్డారు. ఇతర రాష్ట్రాల నుంచి ఏపీకి వచ్చిన మరో 39 మందికీ వైరస్ సోకింది. అంతా కలిపి.. గడచిన 24 గంటల్లో 294 మందికి కరోనా సోకినట్టు ప్రభుత్వం తెలిపింది. ఇప్పటివరకు రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 6152కు చేరింది.
ఏపీలో కొత్తగా 294 కరోనా పాజిటివ్ కేసులు - కరోనా వైరస్ వార్తలు
ఆంధ్ర ప్రదేశ్లో కొత్తగా 294 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇతర రాష్ట్రాల నుంచి ఏపీకి వచ్చిన మరో 39 మందికీ వైరస్ సోకిింది.

రాష్ట్రంలో కొత్తగా 294 కరోనా పాజిటివ్ కేసులు
కర్నూలులో ఒకరు.. తూర్పు గోదావరి జిల్లాలో మరొకరు మృతి చెందారు. వీరితో కలిపి.. కరోనా కారణంగా చనిపోయిన వారి సంఖ్య 84కు చేరింది. అలాగే.. 82 మంది కోలుకుని డిశ్చార్జ్ అయినట్లు వెల్లడించింది. ప్రస్తుతం వివిధ ఆస్పత్రుల్లో 2034 మంది చికిత్స పొందుతున్నారు.
ఇవీ చూడండి:స్వచ్ఛతే ఆరోగ్య సోపానం.. అవగాహనే కీలకం