Gold Rate Today 9th October 2023 : దేశంలో పసిడి, వెండి ధరలు స్వల్పంగా పెరిగాయి. ఆదివారం 10 గ్రాముల బంగారం ధర రూ.58,930 ఉండగా.. సోమవారం రూ.150 పెరిగి రూ.59,080కు చేరింది. ఆదివారం కిలో వెండి ధర రూ.70,000 ఉండగా.. సోమవారం రూ.845 పెరిగి రూ.70,845కు చేరుకుంది.
- Gold Price In Hyderabad 9th October 2023 : హైదరాబాద్‌లో పది గ్రాముల బంగారం ధర రూ.59,080గా ఉంది. మరోవైపు కిలో వెండి ధర రూ.70,845గా ఉంది.
- Gold Price In Vijayawada 9th October 2023 : విజయవాడలో పది గ్రాముల పసిడి ధర రూ.59,080గా ఉంది. కిలో వెండి ధర రూ.70,845కు చేరుకుంది.
- Gold Price In Vishakhapatnam 9th October 2023 : విశాఖపట్నంలో 10 గ్రాముల పుత్తడి ధర రూ.59,080గా ఉంది. కిలో వెండి ధర రూ.70,845గా ఉంది.
- Gold Price In Proddatur 9th October 2023 : ప్రొద్దుటూరులో 10గ్రాముల పసిడి ధర రూ.59,080 ఉంది. కిలో వెండి ధర రూ.70,845కు చేరుకుంది.
గమనిక : పైన పేర్కొన్న ధరలు ఉదయం మార్కెట్ ప్రారంభంలో ఉన్నవి మాత్రమే. ఈగోల్డ్, సిల్వర్ రేట్లు మారుతూ ఉంటాయి. ఈ విషయాన్ని గమనించగలరు.
స్పాట్ గోల్డ్ ధర?
Spot Gold Price 9th October 2023 : అంతర్జాతీయ మార్కెట్లో గోల్డ్ రేట్లు భారీగా పెరిగాయి. ఆదివారం ఔన్స్ స్పాట్ గోల్డ్ ధర 1833 డాలర్లుగా ఉండగా.. సోమవారం ఏకంగా 18 డాలర్లు పెరిగి 1851 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. మరోవైపు గ్లోబల్ మార్కెట్లో సిల్వర్ ధరలు స్థిరంగా ఉన్నాయి ప్రస్తుతం ఔన్స్ వెండి ధర 21.81 డాలర్లుగా ఉంది.
క్రిప్టోకరెన్సీ ధరలు ఎలా ఉన్నాయంటే?
Cryptocurrency News 9th October 2023 : సోమవారం క్రిప్టోకరెన్సీ ట్రేడింగ్ స్వల్ప నష్టాల్లో కొనసాగుతోంది. ప్రస్తుతం ఒక బిట్‌కాయిన్ ధర రూ.23,17,906 వద్ద నష్టాల్లో ట్రేడవుతోంది. మిగతా ప్రధాన క్రిప్టో కరెన్సీ విలువలు ఎలా ఉన్నాయంటే?
క్రిప్టో కరెన్సీ | ప్రస్తుత ధర |
బిట్‌కాయిన్ | రూ.23,17,906 |
ఇథీరియం | రూ.1,35,305 |
టెథర్ | రూ.83.23 |
బైనాన్స్ కాయిన్ | రూ.17,576 |
యూఎస్డీ కాయిన్ | రూ.83.19 |
స్టాక్ మార్కెట్ అప్డేట్స్..
Stock Market Today 9th October 2023 : సోమవారం దేశీయ స్టాక్‌మార్కెట్లు భారీ నష్టాలతో ప్రారంభమయ్యాయి. పశ్చిమాసియాలో ఇజ్రాయిల్-హమాస్‌ల మధ్య ఘర్షణలు జరుగుతుండడం సహా, అంతర్జాతీయ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలు వస్తుండడమే ఇందుకు కారణం.