Gold Rate Today 6th October 2023 : దేశంలో పసిడి, వెండి ధరలు స్వల్పంగా తగ్గాయి. గురువారం 10 గ్రాముల బంగారం ధర రూ.58,385 ఉండగా.. శుక్రవారం రూ.30 తగ్గి రూ.58,355కు చేరింది. గురువారం కిలో వెండి ధర రూ.69,295 ఉండగా.. శుక్రవారం రూ.397 తగ్గి రూ.68,898కు చేరుకుంది.
- Gold Price In Hyderabad 6th October 2023 : హైదరాబాద్‌లో పది గ్రాముల బంగారం ధర రూ.58,355గా ఉంది. మరోవైపు కిలో వెండి ధర రూ.68,898గా ఉంది.
- Gold Price In Vijayawada 6th October 2023 : విజయవాడలో పది గ్రాముల పసిడి ధర రూ.58,355గా ఉంది. కిలో వెండి ధర రూ.68,898గా ఉంది.
- Gold Price In Vishakhapatnam 6th October 2023 : విశాఖపట్నంలో 10 గ్రాముల పుత్తడి ధర రూ.58,355గా ఉంది. కిలో వెండి ధర రూ.68,898గా ఉంది.
- Gold Price In Proddatur 6th October 2023 : ప్రొద్దుటూరులో 10గ్రాముల పసిడి ధర రూ.58,355కిలో వెండి ధర రూ.68,898గా ఉంది.
గమనిక : పైన పేర్కొన్న ధరలు.. ఉదయం మార్కెట్ ప్రారంభంలో ఉన్నవి మాత్రమే. ఈ గోల్డ్, సిల్వర్ రేట్లు మారుతూ ఉంటాయి. గమనించగలరు.
స్పాట్ గోల్డ్ ధర?
Spot Gold Price 6th October 2023 :అంతర్జాతీయ మార్కెట్లోనూ గోల్డ్ రేట్లు స్వల్పంగా తగ్గాయి. గురువారం ఔన్స్ స్పాట్ గోల్డ్ ధర 1828 డాలర్లుగా ఉండగా.. శుక్రవారం 4 డాలర్లు పెరిగి 1824 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. మరోవైపు గ్లోబల్ మార్కెట్లో సిల్వర్ ధరలు దాదాపు స్థిరంగా ఉన్నాయి ప్రస్తుతం ఔన్స్ వెండి ధర 21.03 డాలర్లుగా ఉంది.
క్రిప్టోకరెన్సీ ధరలు ఎలా ఉన్నాయంటే?
Cryptocurrency News 6th October 2023 : శుక్రవారం క్రిప్టోకరెన్సీ ట్రేడింగ్ భారీ నష్టాల్లో కొనసాగుతోంది. ప్రస్తుతం ఒక బిట్‌కాయిన్ ధర రూ.22,92,903 వద్ద నష్టాల్లో ట్రేడవుతోంది. మిగతా ప్రధాన క్రిప్టో కరెన్సీ విలువలు ఎలా ఉన్నాయంటే?
క్రిప్టో కరెన్సీ | ప్రస్తుత ధర |
బిట్‌కాయిన్ | రూ.22,92,903 |
ఇథీరియం | రూ.1,35,063 |
టెథర్ | రూ.83.20 |
బైనాన్స్ కాయిన్ | రూ.17,603 |
యూఎస్డీ కాయిన్ | రూ.83.19 |
స్టాక్ మార్కెట్ అప్డేట్స్..
Stock Market Today 6th October 2023 : శుక్రవారం కూడా దేశీయ స్టాక్‌మార్కెట్లు మంచి లాభాలతో ప్రారంభమయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు రావడం సహా, ఆర్బీఐ కీలక వడ్డీ రేట్లను యథాతథంగా ఉంచనున్నట్లు వార్తలు వస్తున్న నేపథ్యంలో దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా రెండో రోజు కూడా లాభాల్లో కొనసాగుతున్నాయి.