తెలంగాణ

telangana

By

Published : Oct 6, 2021, 9:21 AM IST

Updated : Oct 6, 2021, 3:41 PM IST

ETV Bharat / business

నష్టాలతో ముగిసిన మార్కెట్లు- 17,700 దిగువకు నిఫ్టీ

stocks LIve updates
స్టాక్​ మార్కెట్ లైవ్​

15:39 October 06

స్టాక్ మార్కెట్లు భారీ నష్టాలతో ముగిశాయి. సెన్సెక్స్ 555 పాయింట్లు కోల్పోయి 59,189 వద్ద స్థిరపడింది. ఎన్​ఎస్​ఈ-నిఫ్టీ 176 పాయింట్ల నష్టంతో 17,646 వద్దకు చేరింది.

  • హెచ్​డీఎఫ్​సీ బ్యాంక్​, హెచ్​డీఎఫ్​సీ, బజాజ్ ఫినాన్స్​ షేర్లు మాత్రమే 30 షేర్ల ఇండెక్స్​లో స్వల్పంగా లాభాలను గడించాయి.
  • ఇండస్​ఇండ్​ బ్యాంక్​, టాటా స్టీల్​, బజాజ్ ఆటో, హెచ్​సీఎల్​టెక్​, రిలయన్స్ ఇండస్ట్రీస్​ నష్టాలను మూగట్టుకున్నాయి.

13:06 October 06

మిడ్​ సెషన్​ తర్వాత స్టాక్ మార్కెట్లు నష్టాల్లోకి జారుకున్నాయి. సెన్సెక్స్ 70 పాయింట్లకుపైగా తగ్గి.. 59,670 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 30 పాయింట్లకుపైగా నష్టంతో 17,788 వద్ద కొనసాగుతోంది.

  • హెచ్​డీఎఫ్​సీ బ్యాంక్, హెచ్​డీఎఫ్​సీ, యాక్సిస్​ బ్యాంక్, బజాజ్ ఫినాన్స్​, కోటక్ మహీంద్రా బ్యాంక్ షేర్లు లాభాల్లో ఉన్నాయి.
  • ఇండస్​ ఇండ్​ బ్యాంక్, టైటాన్​, సన్​ ఫార్మా, టాటా స్టీల్​, హెచ్​సీఎల్​టెక్​ షేర్లు ప్రధానంగా నష్టాల్లో ఉన్నాయి.

12:27 October 06

స్టాక్​ మార్కెట్లు లాభాల్లో ట్రేడవుతున్నాయి. సెన్సెక్స్ 210 పాయింట్లకుపైగా పెరిగి 59,956 వద్ద కొనసాగుతోంది. నిఫ్టీ 50 పాయింట్లకుపైగా లాభంతో 17,876 వద్ద ట్రేడింగ్ సాగిస్తోంది.

  • హెచ్​డీఎఫ్​సీ బ్యాంక్, హెచ్​డీఎఫ్​సీ, యాక్సిస్​ బ్యాంక్​, బజాజ్ ఫినాన్స్, అల్ట్రాటెక్​ సిమంట్​ లాభాల్లో ఉన్నాయి.
  • టైటాన్, సన్​ ఫార్మా, హెచ్​సీఎల్​టెక్​, ఏషియన్ పెయింట్స్, ఇండస్​ఇండ్​ బ్యాంక్​ నష్టాల్లో ఉన్నాయి.

11:37 October 06

స్టాక్ మార్కెట్లు స్వల్ప లాభాల్లో స్థిరంగా కొనసాగుతున్నాయి. సెన్సెక్స్ 60 పాయింట్లకుపైగా వృద్ధితో 59,808 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ అతి స్వల్పంగా 10 పాయింట్లకుపైగా లాభంతో 17,833 వద్ద కొనసాగుతోంది.

ఆరంభంలో లాభాల్లో దూసుకెళ్లిన ఐటీ షేర్లు ప్రస్తుతం అమ్మకాల ఒత్తిడి ఎదుర్కొంటున్నాయి. బ్యాంకింగ్ షేర్లు సానుకూలంగా స్పందిస్తున్నాయి.

  • హెచ్​డీఎఫ్​సీ, హెచ్​డీఎఫ్​సీ బ్యాంక్, బజాజ్​ ఫినాన్స్​, యాక్సిస్​ బ్యాంక్​, ఎల్​&టీ షేర్లు లాభాల్లో ఉన్నాయి.
  • హెచ్​సీఎల్​టెక్​, ఇండస్​ఇండ్ బ్యాంక్​, టైటాన్​, సన్​ ఫార్మా, టెక్ మహీంద్రా నష్టాల్లో కొనసాగుతున్నాయి.

09:09 October 06

STOCK MARKET LIVE UPDATES

స్టాక్ మార్కెట్లు (Stocks today) బుధవారం సానుకూలంగా ప్రారంభమయ్యాయి. బీఎస్​ఈ-సెన్సెక్స్​ (Sensex today) 130 పాయింట్లకుపైగా లాభంతో 59,883 వద్ద ట్రేడవుతోంది. ఎన్​ఎస్​ఈ-నిఫ్టీ (Nifty today) 50 పాయింట్లకుపైగా పెరిగి 17,873 వద్ద కొనసాగుతోంది. ఐటీ షేర్లు లాభాలకు దన్నుగా నిలుస్తున్నాయి.

  • బజాజ్ ఫినాన్స్​, హెచ్​సీఎల్​టెక్, భారతీ ఎయిర్​టెల్​, ఇన్ఫోసిస్, టెక్ మహీంద్రా షేర్లు ప్రధానంగా లాభాల్లో ఉన్నాయి.
  • కోటక్ మహీంద్రా బ్యాంక్, హెచ్​యూఎల్​, హెచ్​డీఎఫ్​సీ, డాక్టర్ రెడ్డీస్​, హెచ్​డీఎఫ్​సీ బ్యాంక్ ఒడుదొడుకులు ఎదుర్కొంటున్నాయి.
Last Updated : Oct 6, 2021, 3:41 PM IST

ABOUT THE AUTHOR

...view details