తెలంగాణ

telangana

ETV Bharat / business

ఐటీ షేర్ల దూకుడుతో స్వల్ప లాభాలు

ఎఫ్​ఎమ్​జీసీ, ఐటీ షేర్ల దూకుడుతో దేశీయ సూచీలు సోమవారం స్వల్ప లాభాలతో ముగిశాయి. బీఎస్​ఈ సెన్సెక్స్​ 60 పాయింట్లు మెరుగుపడి 38,417కు చేరింది. 21పాయింట్లు వృద్ధి చెందిన ఎన్​ఎస్​ఈ నిఫ్టీ 11,355 వద్ద స్థిరపడింది.

Stock markets ends on a positive note as IT, FMGC stocks gain
ఐటీ షేర్ల దూకుడుతో మార్కెట్లకు స్వల్ప లాభాలు

By

Published : Sep 7, 2020, 3:47 PM IST

Updated : Sep 7, 2020, 4:06 PM IST

దేశీయ స్టాక్​మార్కెట్లు సోమవారం స్వల్ప లాభాలతో ముగిశాయి. వాహన, బ్యాంక్​ రంగాల్లో ఒత్తిళ్లు ఎదురైనప్పటికీ.. ఎఫ్​ఎమ్​జీసీ, ఐటీ షేర్ల దూకుడుతో చివరి నిమిషంలో లాభాలను నమోదు చేశాయి.

బీఎస్​ఈ సెన్సెక్స్​ 60 పాయింట్లు వృద్ధి చెంది 38,417 వద్ద స్థిరపడింది. 21 పాయింట్లు మెరుగుపడిన ఎన్​ఎస్​ఈ నిఫ్టీ 11,355కు చేరింది.

లాభానష్టాలు...

టీసీఎస్​, ఐటీసీ, ఇన్ఫోసిస్​, హెచ్​యూఎల్​, రిలయన్స్​, ఏషియన్​ పెయింట్స్​, హెచ్​డీఎఫ్​సీ, హెచ్​సీఎల్​టెక్​, యాక్సిస్​ బ్యాంక్​, టైటాన్​, టాటాస్టీల్​, మారుతి షేర్లు లాభాల్లో ముగిశాయి.

ఎం అండ్​ ఎం​, బజాజ్​ ఫిన్​సర్వ్​, టెక్​ఎమ్​, హెచ్​డీఎప్​సీ బ్యాంక్​, ఎల్​ అండ్​ టీ, ఓన్​జీసీ షేర్లు నష్టాలను మూటగట్టుకున్నాయి.

లాభనష్టాలు

రూపాయి...

కరెన్సీ మార్కెట్​లో రూపాయి సోమవారం 21 పైసలు నష్టపోయింది. డాలర్​తో పోలిస్తే మారకం విలువ 73.35 వద్దకు చేరింది. డాలరు బలపడడం, దేశీయ ఈక్విటీలో రూపాయికి ఆదరణ తగ్గడమే ఇందుకు కారణంగా నిపుణులు చెబుతున్నారు.

ఇదీ చూడండి:-స్టాక్‌ మార్కెట్‌లో 'మహిళా' శక్తి

Last Updated : Sep 7, 2020, 4:06 PM IST

ABOUT THE AUTHOR

...view details