తెలంగాణ

telangana

ETV Bharat / business

మాంద్యం భయాలతో ప్రపంచ మార్కెట్లు కుదేలు

అగ్ర దేశాల మధ్య వాణిజ్య ఉద్రిక్తతలతో అంతర్జాతీయ స్టాక్​ మార్కెట్లు కుదేలయ్యాయి. అమెరికా డౌజోన్స్​ ఈ ఏడాదిలో భారీ పతనం చవిచూసింది. ఫలితంగా ఐరోపా, ఆసియా మార్కెట్లు నష్టాల బాట పట్టాయి.

ప్రపంచ మార్కెట్లు

By

Published : Aug 15, 2019, 2:37 PM IST

Updated : Sep 27, 2019, 2:32 AM IST

ఆర్థిక మాంద్యం భయాలు ప్రపంచ మార్కెట్లను కుదిపేశాయి. చైనా పరిశ్రమల ఉత్పత్తి 17 ఏళ్ల కనిష్ఠానికి పడిపోవటం, రెండో త్రైమాసికంలో జర్మనీ ఆర్థిక వ్యవస్థ తిరోగమన దిశలో పయనించిందన్న నివేదికలతో అనిశ్చితి నెలకొంది. ఈ నేపథ్యంలో అమెరికా డౌజోన్స్​ భారీస్థాయిలో నష్టపోయింది.

డౌజోన్స్​ 800 పాయింట్లు కోల్పోయి 24,479 వద్ద ముగిసింది. ఈ ఏడాది డౌజోన్స్​ ఈ స్థాయిలో పతనం అవడం ఇదే తొలిసారి. ఈ ప్రభావంతో ఐరోపా మార్కెట్లు 2 శాతం మేర నష్టపోయాయి.

చైనా ఉత్పత్తులపై సుంకాలను వెనక్కు తీసుకున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్​ నిర్ణయం నేపథ్యంలో కొన్నిరోజులుగా సానుకూలంగా స్పందించాయి మార్కెట్లు. చైనా పరిస్థితి, జర్మనీ నివేదికతో మళ్లీ నష్టాల వైపు సాగాయి.

ఆసియాపై ప్రభావం

అమెరికా విపణి ప్రభావంతో ఆసియా మార్కెట్లు కూడా నష్టాల బాట పట్టాయి. హాంగ్​కాంగ్​ నిరసనల్లో బీజింగ్​ జోక్యంతో అనిశ్చితి నెలకొనడం మరో కారణం.

జపాన్​ నిక్కీ మొదట 2 శాతం మేర క్షీణించినా... తిరిగి కోలుకుని 1.2 శాతం నష్టంతో రోజును ముగించింది. హాంగ్​కాంగ్​ మార్కెట్ తొలుత 1.5 శాతం నష్టాలు చవిచూసినా చివరకు కోలుకుని 0.1 శాతం నష్టాలతో ముగిసింది. షాంఘై, జకర్తా మార్కెట్లు 0.7 శాతం, సింగపూర్​ 0.9 శాతం మేర కోల్పోయాయి.

జర్మనీ నివేదిక

రెండో త్రైమాసికంలో ఐరోపా ఆర్థిక వ్యవస్థ మందగించిందని జర్మనీ నివేదిక పేర్కొంది. ఫ్రాంక్​ఫర్ట్​ సూచీలు మూడు నెలల కనిష్ఠానికి పడిపోయాయి.

Last Updated : Sep 27, 2019, 2:32 AM IST

ABOUT THE AUTHOR

...view details