పసిడి ధరలు తగ్గుముఖం పట్టాయి. దేశ రాజధాని దిల్లీలో 10 గ్రాముల స్వచ్ఛమైన పసిడి ధర రూ.145 తగ్గి.. రూ.39,070కి చేరింది. రూపాయి పుంజుకోవడం సహా.. అంతర్జాతీయంగా డిమాండు తగ్గడం ఇందుకు ప్రధాన కారణమని నిపుణులు అంటున్నారు.
బంగారంతో పాటే వెండి ధరలు నేడు క్షీణించాయి. దేశ రాజధాని దిల్లీలో కిలో వెండి ధర రూ.315 తగ్గి.. రూ.46,325 వద్దకు చేరింది.