తెలంగాణ

telangana

ETV Bharat / business

తొలి త్రైమాసికంలో విప్రో లాభం రూ.2,387 కోట్లు

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో విప్రో లాభాలు గతేడాదితో పోలిస్తే 12.5 శాతం పెరిగాయి. మొత్తం రూ.2,387.6 కోట్ల లాభాన్ని గడించింది.

విప్రో

By

Published : Jul 17, 2019, 6:40 PM IST

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో దేశీయ ఐటీ దిగ్గజం విప్రో రూ. 2,387.6 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. గత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో నమోదైన రూ.2,120.8 కోట్ల లాభంతో పోలిస్తే.. ప్రస్తుతం క్యూ1లో నమోదైన లాభాలు 12.5 శాతం అధికం.

2019-20 మొదటి త్రైమాసికంలో 5 శాతం వృద్ధితో రూ.15.566.6 కోట్ల ఏకీకృత ఆదాయన్ని గడించింది విప్రో. గత ఆర్థిక సంవత్సరం ఇదే సమయంలో సంస్థ ఆదాయం రూ. 14,827 కోట్లుగా ఉంది.

ఇదీ చూడండి: ఆర్బీఐ మూలధనంపై జలాన్​ కమిటీ నివేదిక సిద్ధం

ABOUT THE AUTHOR

...view details