ICICI Credit Card: ప్రైవేటు రంగానికి చెందిన దిగ్గజ బ్యాంకు ఐసీఐసీఐ.. క్రెడిట్ కార్డు ఛార్జీలను భారీగా పెంచింది. ఫిబ్రవరి 10న సవరించిన రేట్లు అమల్లోకి వచ్చాయి.
అన్ని కార్డులపై ఇక నుంచి బ్యాంకు.. 2.5 శాతం ట్రాన్సాక్షన్ ఫీజును వసూలు చేయనుంది. క్యాష్ అడ్వాన్సెస్కు ఇది వర్తిస్తుంది. కనీస లావాదేవీ ఛార్జీ రూ. 500గా ఉండనుంది.
బ్యాంక్ లేట్ పేమెంట్ ఛార్జీలను కూడా ఐసీఐసీఐ పెంచేసింది. ఐసీఐసీఐ బ్యాంక్ ఎమరాల్డ్ క్రెడిట్ కార్డు మినహా ఇతర క్రెడిట్ కార్డులు అన్నింటికీ ఇది వర్తిస్తుంది.
క్రెడిట్ కార్డు బిల్లును బట్టి.. ఈ లేట్ పేమెంట్ ఛార్జీలు మారుతూ ఉంటాయి. బిల్లు రూ. 100 లోపు ఉంటే.. ఎలాంటి ఛార్జీ వసూలు చేయదు.
గరిష్ఠ లేట్ పేమెంట్ ఛార్జీని రూ. 1200గా నిర్ణయించింది ఐసీఐసీఐ. క్రెడిట్ కార్డుపై ఔట్స్టాండింగ్ అమౌంట్ రూ. 50 వేలు అంతకన్నా ఎక్కువ ఉంటే.. ఈ ఛార్జీ పడుతుంది.
ICICI Bank credit card new charges
- కార్డుపై బకాయి రూ. 100 కంటే తక్కువ ఉంటే.. నో ఛార్జీ.
- రూ. 100-500 వరకు ఉంటే.. రూ. 100 ఛార్జీ పడుతుంది.
- రూ. 501- 5000 బకాయికి రూ. 500 ఛార్జీ
- రూ. 10 వేల వరకు ఔట్స్టాండింగ్ అమౌంట్ ఉంటే రూ. 750 ఛార్జీ వసూలు చేయనుంది ఐసీఐసీఐ.
- రూ. 25 వేలకు 900 రూపాయలు, రూ. 50 వేల బకాయికి 1000 రూపాయల వరకు ఛార్జీ పడుతుంది.
- రూ. 50 వేలు అంతకన్నా ఎక్కువకు.. రూ. 1200 ఛార్జీ చేయనుంది. ఇదే గరిష్ఠం.
క్రెడిట్ కార్డుపై డ్యూ మొత్తం రూ.50 వేలకు మించి ఉంటే హెచ్డీఎఫ్సీ, ఎస్బీఐ రూ.1300, యాక్సిస్ బ్యాంక్ రూ.1000 వరకు ఛార్జీలను వసూలు చేస్తున్నాయి.
చెక్ ఛార్జీలు కూడా..
ICICI Cheque Return Charges: ఐసీఐసీఐ బ్యాంక్ చెక్ ఛార్జీలను కూడా పెంచింది. చెక్ రిటర్న్ అయితే చెల్లించాల్సిన బకాయి మొత్తంలో 2 శాతం ఛార్జీ పడుతుంది. కనీసం రూ. 500 కోత విధించనుంది.
ఇవీ చూడండి:ఎన్నికల తర్వాత ధరల మోతే- వంట నూనెలు, పెట్రోల్ పైపైకి!
మళ్లీ టారిఫ్ పెంపు.. ఎయిర్టెల్ కస్టమర్లకు మరింత భారం!