తెలంగాణ

telangana

ETV Bharat / business

ఈపీఎఫ్​ఓ చందాదార్లకు శుభవార్త.. పెరిగిన వడ్డీ రేట్లు

పండుగ ముందు ఈపీఎఫ్ఓ​ చందాదారులకు శుభవార్త చెప్పింది కేంద్రం. 2017-18లో 8.55 శాతంగా ఉన్న వడ్డీ రేట్లను 2018-19 సంవత్సరానికి 8.65 శాతానికి పెంచినట్లు వెల్లడించింది.

ఈపీఎఫ్ఓ

By

Published : Sep 17, 2019, 7:26 PM IST

Updated : Sep 30, 2019, 11:35 PM IST

ఉద్యోగుల భవిష్యనిధి (ఈపీఎఫ్‌ఓ) చందాదారులు 2018-19 సంవత్సరానికి డిపాజిట్లపై 8.65 శాతం వడ్డీని పొందుతారని కార్మిక శాఖ మంత్రి సంతోష్ గంగ్వార్ తెలిపారు.

2017-18లో 8.55 శాతంగా ఉన్న ఈపీఎఫ్​ వడ్డీ రేట్లను.. 2018-19 సంవత్సరానికి 8.65 శాతంగా నిర్ణయించినట్లు గంగ్వార్​ తెలిపారు. పెంచిన వడ్డీతో 6 కోట్ల మంది ఈపీఎఫ్​ఓ చందాదారులు లబ్ధిపొందుతారని పేర్కొన్నారు.

కార్మిక, ఆర్థిక మంత్రిత్వ శాఖల మధ్య వడ్డీరేటుపై తొలుత భిన్నాభిప్రాయాలు వచ్చాయి. ఈ అనిశ్చితులను తొలగించుకునేందుకు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో చర్చలు జరిపారు కార్మిక శాఖ అధికారులు. ఈపీఎఫ్​ఓ చందాదారులకు 8.65 శాతం వడ్డీ రేటు చెల్లించినా.. సరిపడా మిగులు సంస్థ వద్ద ఉందని వివరించిన అనంతరం రేట్ల పెంపునకు మార్గం సుగమమైనట్టు ఓ సీనియర్​ అధికారి తెలిపారు.

ఇదీ చూడండి: ఫేస్​బుక్​, ఇన్​స్టాలో కొత్త ఫీచర్లు.. ఏంటో తెలుసా?

Last Updated : Sep 30, 2019, 11:35 PM IST

ABOUT THE AUTHOR

...view details