తెలంగాణ

telangana

ETV Bharat / business

వచ్చే జనవరి నుంచి నెఫ్ట్​ ఛార్జీలు రద్దు

పెద్దనోట్ల రద్దకు మూడేళ్లు పూర్తయిన సందర్భంగా.. డిజిటల్ లావాదేవీల వృద్ధి ప్రోత్సాహకాలు ప్రకటించింది రిజర్వు బ్యాంకు. ఇందులో భాగంగా 2020 జనవరి నుంచి సేవింగ్స్ ఖాతాదారులకు నెఫ్ట్​ ఛార్జీలు రద్దు చేయాలని బ్యాంకులకు ఆదేశాలు జారీ చేసింది.

'వచ్చే జనవరి నుంచి నెఫ్ట్​ ఛార్జీలు రద్దు'

By

Published : Nov 8, 2019, 6:30 PM IST

వచ్చే ఏడాది జనవరి నుంచి సేవింగ్స్ ఖాతాదారులకు నెఫ్ట్ ఛార్జీల రద్దుకానున్నాయి. పొదుపు ఖాతాదారుల నుంచి నెఫ్ట్ ఛార్జీలు వసూలు చేయరాదని బ్యాంకులను ఆదేశించింది ఆర్బీఐ. పెద్ద నోట్ల రద్దుకు మూడేళ్లు పూర్తయిన సందర్భంగా ఆర్బీఐ ఈ నిర్ణయాన్ని ప్రకటించింది.

అదే విధంగా ఇప్పటి వరకు టోల్​గేట్​ కోసం వినియోగిస్తోన్న 'ఫాస్ట్ ట్యాగ్'​ను పార్కింగ్​, పెట్రోల్​ బంకుల్లో రుసుములు చెల్లించేందుకు వినియోగించేలా ప్రతిపాదన తీసుకువ్చచింది ఆర్బీఐ.

డిజిటల్ లావాదేవీలు వృద్ధికి..

డిజిటల్ లావాదేవీలను పెంచే లక్ష్యంతో ఆర్​టీజీఎస్​, నెఫ్ట్​ ఛార్జీలు వసూలు చేయరాదని ఇటీవల నిర్ణయించింది ఆర్బీఐ. ఇందులో భాగంగానే బ్యాంకులకు తాజా ఆదేశాలు జారీచేసింది. ఈ ప్రయోజనాలు ఖాతాదారులకు అందజేయాలని సూచించింది. దీనికి సంబంధించి వారంలోగా మార్గదర్శకాలు జారీచేస్తామని ఓ ప్రకటనలో తెలిపింది రిజర్వు బ్యాంకు.

పెద్దమొత్తంలో నగదు బదిలీలకు ఆర్టీజీఎస్‌ను ఉపయోగిస్తుండగా... రెండు లక్షల్లోపు నగదు బదిలీలకు నెఫ్ట్‌ను వినియోగిస్తున్నారు.

ఇదీ చూడండి: ఎస్​బీఐ వినియోగదారులకు శుభవార్త.. వడ్డీ రేట్ల తగ్గింపు

ABOUT THE AUTHOR

...view details