తెలంగాణ

telangana

By

Published : Dec 18, 2019, 4:09 PM IST

ETV Bharat / business

ట్రాకింగ్​ ఆఫ్​ చేసినా మీ లొకేషన్​ తెలుసుకుంటున్న ఫేస్​బుక్​!

తమ యూజర్లు లొకేషన్​ ట్రాకింగ్​ను నిలిపివేసినప్పటికీ.. వారు ఎక్కడున్నరో తెలుసుకోగలుగుతామని ఫేస్​బుక్​ వెల్లడించింది. తమకు తెలియకుండా తమ లొకేషన్​ను తెలుసుకుంటున్నారన్న విషయంపై యూజర్లు మండిపడుతున్నారు.

FACEBOOK
ఫేస్​బుక్​

సామాజిక మాధ్యమ దిగ్గజం 'ఫేస్​బుక్​' యూజర్ల లొకేషన్​ ట్రాకింగ్​కు సంబంధించి విస్తుపోయే నిజాలు బయటపెట్టింది. సెట్టింగ్స్​లో ట్రాకింగ్ సదుపాయాన్ని నిలిపినప్పటికీ.. తమ యూజర్లు ఎక్కడున్నారనేది తాము తెలుసుకోగలుగుతామని వెల్లడించింది.

ఇద్దరు అమెరికన్​ సెనెటర్లు చేసిన అభ్యర్థన మేరకు ఈ విషయాలు వెల్లడించింది ఫేస్​బుక్​. యూజర్ల లొకేషన్​ను తెలుసుకోవడం ద్వారా దగ్గర్లోని దుకాణాల సమాచారం ఇవ్వడం సహా హ్యాకర్లు, తప్పుదోవ పట్టించే వారి నుంచి వినియోగదారుల్ని రక్షించవచ్చని వివరించింది.

ఫేస్​బుక్​ వెల్లడించిన ఈ అంశం సామాజిక మాధ్యమాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది.

"ఇక్కడ ఆప్టింగ్​ ఔట్ సదుపాయం లేదు. మీ వ్యక్తిగత సమాచారంపై మీకు నియంత్రణ లేదు.​ అది పెద్ద టెక్​ సంస్థ. అందుకే కాంగ్రెస్​ దానిపై చర్యలు తీసుకోవాలి" అని రిపబ్లికన్​ సెనెటర్ జోష్​ హౌలే ట్విట్టర్​లో పేర్కొన్నారు.

ఇదీ చూడండి:రూ.5.6 కోట్ల జరిమానా చెల్లింపునకు సిద్ధమైన ఇన్ఫీ!

ABOUT THE AUTHOR

...view details