ప్రైమ్ డే సేల్ పేరుతో ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ ఇచ్చే ఆఫర్లు అన్నీ ఇన్నీ కావు. ఈసారి జులై 15-16 వస్తున్న ప్రైమ్ డే సేల్‌లో యువతకు బంపర్ ఆఫర్ ప్రకటించింది అమెజాన్.
ఈ రెండు రోజులు రూ. 999 ఖరీదైన అమెజాన్ ప్రైమ్ సభ్యత్వాన్ని సగం ధరకే... అంటే రూ. 500లకే ఇవ్వనున్నట్లు వెల్లడించింది. అయితే 18 నుంచి 24 ఏళ్ల మధ్య వయస్సున్న ఉన్న యువతకు మాత్రమే ఈ ఆఫర్ అందుబాటులో ఉంచింది అమెజాన్.
ప్రైమ్ సభ్యత్వం పొందడం ఇలా...
అమెజాన్ ప్రైమ్ సభ్యత్వాన్ని తీసుకోవాలని అనుకునే యువత అమెజాన్ ప్రైమ్ యాప్‌లో యూత్ ఆఫర్‌పై క్లిక్ చేసి సభ్యత్వ రుసుము రూ.999 లను డెబిట్/క్రెడిట్ కార్డు ద్వారా గానీ, ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా గానీ చెల్లించాల్సి ఉంటుంది.