తెలంగాణ

telangana

By

Published : May 28, 2021, 8:47 AM IST

ETV Bharat / business

అందుబాటు ధరలో గూగుల్- జియో స్మార్ట్​ఫోన్!

గూగుల్​- జియో కలిసి అందుబాటు ధర స్మార్ట్​ఫోన్​ను అభివృద్ధి చేస్తున్నాయి. ప్రస్తుతం ఈ ప్రాజెక్టు పనులు కొనసాగుతున్నాయని గూగుల్​ సీఈఓ సుందర్ పిచాయ్ తెలిపారు. అయితే.. ఆ ఫోన్​ను ఎప్పుడు విడుదల చేస్తారు? ధర వంటి అంశాలను ఆయన వెల్లడించలేదు.

Google CEO Sundar Pichai
గూగుల్​ సీఈఓ సుందర్ పిచాయ్

అందుబాటు ధర స్మార్ట్​ ఫోన్​ను ఆవిష్కరించేందుకు రిలయన్స్ జియోతో కలిసి పనిచేస్తున్నామని.. ఆ ప్రాజెక్టు పనులు కొనసాగుతున్నాయని గూగుల్​ సీఈఓ, భారత సంతతి వ్యక్తి అయిన సుందర్ పిచాయ్ పేర్కొన్నారు.

గతేడాది జియో ప్లాట్​ఫామ్స్​లో 7.7 శాతం వాటాను రూ. 33,737 కోట్లతో గూగుల్ కొనుగోలు చేసింది. అదే సమయంలో ఒక ప్రారంభ స్థాయి, అందుబాటు ధర స్మార్ట్​ఫోన్​ను సంయుక్తంగా అభివృద్ధి చేయటం కోసం ఒక వాణిజ్య ఒప్పందాన్నీ అప్పట్లోనే జియోతో కుదుర్చుకుంది.

సాంకేతికత వేగాన్ని పెంచటం కోసం..

ఆసియా పసిఫిక్​ ప్రాంతానికి చెందిన కొంత మంది విలేకర్లతో గురువారం జరిగిన దృశ్యమాధ్యమ సమావేశంలో స్మార్ట్​ఫోన్​ రూపొందిస్తున్నామనే విషయాన్ని పిచాయ్ స్పష్టం చేశారు. ఆ ఫోన్​ను ఎప్పుడు విడుదల చేస్తారు, ధర వంటి అంశాలను ఆయన వెల్లడించలేదు. భారత్​లో డిజిటల్​ సాంకేతికత వేగాన్ని పెంచటం కోసం ఇండియా డిజిటైజేషన్ ఫండ్ (ఐడీఎఫ్) కింద వచ్చే 5-7 ఏళ్ల వ్యవధిలో రూ. 75,000 కోట్ల(10 బిలియన్ డాలర్లు) పెట్టుబడులు పెడతాయని గతేడాది జులైలో పిచాయ్​ తెలిపిన సంగతి విదితమే.

'ఐడీఎఫ్​ నుంచి కొత్త అవకాశాలపై నిధులు పెట్టడానికి చూస్తున్నాం. ఈ ఏడాది చివర్లో ఇందుకు సంబంధించి మరికొన్ని ప్రకటనలు చేస్తాం' అని పిచాయ్ అన్నారు.

ఇదీ చదవండి :సుంకం లేకుండా 'యాంఫోటెరిసిన్​-బీ' దిగుమతి!

ABOUT THE AUTHOR

...view details