ద్విచక్ర వాహనాలకు అతిపెద్ద మార్కెట్లలో భారత్ ఒకటి. మన దేశంలో బడ్జెట్ సెగ్మెంట్లోని బైక్‌లకు ఆధరణ ఎక్కువగా ఉంటుంది. గత కొనేళ్లుగా ఈ విభాగంలో పోటీ ఎక్కువై.. మార్కెట్లోకి కొత్త కొత్త మోడళ్లు వచ్చాయి. బీఎస్6 ఉద్గార నియమాల వల్ల బైక్‌ల ధరలు కాస్త పెరిగిగాయి. అంతకుమందు రూ.లక్షలోపు ఉండే బైక్‌లు ఇప్పుడు రూ.లక్ష దాటాయి. అయితే.. ప్రదర్శనతో పాటు బడ్జెట్‌ను పరిగణనలోకి తీసుకుని బైక్ కొనుగోలు చేయటం ఉత్తమం. మరి ప్రస్తుతం రూ.లక్షలోపు ఉన్న కొన్ని బెస్ట్ మోడల్స్‌ని పరిశీలిద్దాం..
బజాజ్ పల్సర్ 150
ఇది చాలా పాపులర్ బైక్. ఐదు వేరియంట్లు, 12 కలర్లలో ఇది లభిస్తుంది. నియాన్, స్టాండర్డ్, ట్విన్ డిస్క్ వేరియంట్ల ఇందులో ఉన్నాయి.
- ఇంజిన్ - 149.5 సీసీ
- వేరియంట్లు - నియాన్, స్టాండర్డ్, ట్విన్ డిస్క్
- గేర్ బాక్స్- 5 స్పీడ్
- మైలేజీ - లీటర్‌కు 50 కిలోమీటర్లు
- 240 ఎంఎం ఫ్రంట్ డిస్క్ , 130 ఎంఎం రియర్ డ్రమ్ బ్రేక్
- ధర- రూ.103,597 నుంచి రూ.107,494 (ఎక్స్ షోరూం హైదరాబాద్) పల్సర్ 150
హోండా యూనికార్న్
బీఎస్6 యూనికార్న్ బైక్‌ను దాదాపు సంవత్సరం క్రితం విడుదల చేసింది. ఇది కేవలం ఒక వేరియంట్ లోనే ఉంది.
- ఇంజిన్ - 162.77 సీసీ
- గేర్ బాక్స్ - 5 స్పీడ్
- మైలేజీ - 50 కిలోమీటర్లు
- ధర- రూ. 99,030 (ఎక్స్ షోరూం హైదరాబాద్) హోండా యూనికార్న్
బజాజ్ పల్సర్ 125 డిస్క్
ఇది పల్సర్ 150ని పోలి ఉంటుంది. 6 కలర్లలో ఈ బైక్ లభ్యం అవుతుంది.
- ఇంజిన్ - 124.4 సీసీ
- గేర్ బాక్స్ - 5 స్పీడ్
- మైలేజీ - 51 కిలోమీటర్లు
- 12 బీహెచ్పీ , 11 ఎన్ఎం పీక్ టార్ సామర్థ్యం
- 240 ఎంఎం ఫ్రంట్ డిస్క్ బ్రేక్, 130 ఎంఎం రియర్ డ్రమ్ బ్రేక్
- ధర రూ. 74,835 (ఎక్స్ షోరూం హైదరాబాద్) పల్సర్ 125