తెలంగాణ

telangana

ETV Bharat / business

జొమాటోకు దీటుగా స్విగ్గీ- మరిన్ని ఆఫర్లు ఖాయమా? - ఆన్‌లైన్‌ ఆహార సేవల సంస్థ స్విగ్గీ

ఆన్‌లైన్‌ ఆహార సేవల సంస్థ స్విగ్గీ తమ కార్యకలాపాలను మరింత విస్తరించనుంది. 2019 డిసెంబర్​ నాటికి 600 నగరాలు, 200 విశ్వవిద్యాలయాలకు విస్తరించాలని లక్ష్యంగా పెట్టుకుంది.

స్విగ్గీ

By

Published : Oct 7, 2019, 7:38 PM IST

ఆన్​లైన్​ ఫుడ్​ డెలివరీ సేవల సంస్థ... భారీ విస్తరణ ప్రణాళికలు ప్రకటించింది. ఈ ఏడాది డిసెంబర్ నాటికి దేశంలోని 600 నగరాలు, 200 విశ్వవిద్యాలయాలకు వ్యాపారాన్ని విస్తరించనున్నట్లు వెల్లడించింది.
లాంచ్​ప్యాడ్​ కార్యక్రమం కింద విద్యార్థుల ద్వారా విశ్వవిద్యాలయాల్లో వ్యాపార కార్యకలాపాలు సాగించాలని భావిస్తున్నట్లు తెలిపింది స్విగ్గీ.

ప్రస్తుతం 500 నగరాలు, 75 యూనివర్సిటీల్లో స్విగ్గీ కార్యకలాపాలు సాగిస్తోంది. ఆయా నగరాల్లోని లక్షా 40 వేల రెస్టారెంట్ల ద్వారా కస్టమర్లకు ఆహారం అందిస్తోంది.

ఇదీ చూడండి : మాంద్యం భయాలు తగ్గెన్​- మార్కెట్లకు లాభాలొచ్చెన్!

ABOUT THE AUTHOR

...view details