తెలంగాణ

telangana

By

Published : Aug 19, 2019, 4:58 PM IST

Updated : Sep 27, 2019, 1:08 PM IST

ETV Bharat / business

స్విగ్గీలో బీర్​.. అడ్డంగా దొరికిపోయిన చోర్​!

బీరు, బిర్యానీ కాంబినేషన్​కున్న క్రేజ్​ వేరు. కానీ సంపూర్ణ మద్యపాన నిషేధం అమలవుతున్న గుజరాత్​ లాంటి చోట మీకు బీరు తాగాలనిపిస్తే... అబ్బో చాలా కష్టం. మహాత్ముడు పుట్టిన గుజరాత్​లో నిషేధం అమల్లో ఉండగా అదెలా సాధ్యం? అని అనుకుంటున్నారా. కానీ వడోదరలో ఓ ఫుడ్​ డెలివరీ బాయ్​కు ఫోన్​ చేస్తే.. నిమిషాల్లోనే బీరుతో మీ ముందుంటాడు. ఆ బాయ్ చేసేది 'ఫుడ్​ డెలివరీ'. కానీ సరఫరా చేసేది బీరు.

స్విగ్గీలో బీర్​ ... డెలివరీ బాయ్​ బుక్​

స్విగ్గీలో బీర్​.. అడ్డంగా దొరికిపోయిన చోర్​!
ఆన్‌లైన్‌లో ఆర్డర్​ కొట్టగానే వేడి వేడి ఆహారాన్ని క్షణాల్లో ముందుంచే ఫుడ్​ డెలివరీ బాయ్​లు చాలా మందే ఉంటారు. కానీ బీర్​ ఆన్​లైన్​లో సరఫరా చేస్తే..? అదికూడా మద్యపాన నిషేధం సంపూర్ణంగా అమల్లో ఉండే గుజరాత్​లో అయితే? మందుబాబులకు ఎంత కిక్కో. బీరు బిర్యానీ కాంబోకి మందుబాబుల్లో ఉండే క్రేజ్​ వేరు. అలాంటి వారి బాధను అర్థం చేసుకున్నాడో స్విగ్గీ డెలివరీ బాయ్.​ మద్యపాన నిషేధం అమల్లో ఉన్న గుజరాత్ రాష్ట్రంలోని వడోదరలో ఫుడ్ డెలివరీతో పాటు కింగ్​ఫిషర్​ టిన్ బీరు డెలివరీ చేసి బీరు ప్రియుల దాహం తీర్చాడు.

పోలీసులకు దొరికేశాడు...

రాహుల్ మహిదా స్విగ్గీలో డెలివరీ బాయ్​గా పని చేస్తున్నాడు. తాను తరచుగా ఓ ఇంటికి ఫుడ్​ డెలివరీ చేసేవాడు. స్నేహితులంతా కలిసి భోంచేసేవారు. ఆహారంతో పాటు బీరు సరఫరా చేస్తే బాగుంటుందని రాహుల్​కు ఉచిత సలహా కూడా ఇచ్చారు. అలా వారి స్నేహం కుదిరింది, కోరినప్పుడల్లా వారికి ఫుడ్​తో పాటు బీరు డెలివరీ చేస్తూ అదనపు ఆదాయాన్ని పొందుతున్నాడు. మద్యపాన నిషేధం పూర్తిగా అమలవుతున్న రాష్ట్రంలో బీరు దొరకడం అంత సులభం కాదు. అయినా సాహసం చేసి బీరు తీసుకొచ్చాడంటే అతని కస్టమర్లపై ఉన్న ప్రేమ అలాంటిది మరి.

అక్రమంగా సాగిస్తున్న ఆ సైడ్​ బిజినెస్​ ఎక్కువ రోజులు నడవలేదు. ఫుడ్ డెలివరీ ముసుగులో మద్యం సరఫరా చేస్తూ చివరకు పోలీసులకు దొరికిపోయాడు. ఎట్టకేలకు బీరు డెలివరీ బాయ్​ని పోలీసులు అరెస్ట్ చేసి, విచారిస్తున్నారు..

ఇదీ చూడండి: వేలి ముద్రలతో వాట్సాప్​కు తాళం వేయండిక!

Last Updated : Sep 27, 2019, 1:08 PM IST

ABOUT THE AUTHOR

...view details