తెలంగాణ

telangana

ETV Bharat / business

ఎక్కువ సిమ్​ కార్డులు ఉన్నవారికి అలర్ట్.. ఇలా చేయకపోతే..

Sim card re verification: మీ పేరుమీద 9 కన్నా ఎక్కువ సిమ్ కార్డులు ఉన్నాయా? అయితే మీకో అలర్ట్! వీటి పునఃధ్రువీకరణ చేపట్టకపోతే.. కనెక్షన్ కట్ అవుతుంది. అదనపు మొబైల్ కనెక్షన్లను డీ యాక్టివేట్ చేయాల్సిందిగా టెలికమ్యూనికేషన్ల శాఖ ఆదేశాలు జారీ చేసింది.

SIM CARD CONNECTION
sim card re verification

By

Published : Dec 9, 2021, 8:42 AM IST

Sim card re verification: దేశంలో ఒకే వినియోగదారుడి పేరు మీద 9 కంటే ఎక్కువ సిమ్‌ కార్డులుంటే, మళ్లీ ధ్రువీకరణ చేయాల్సిందిగా టెలికమ్యూనికేషన్ల శాఖ (డాట్‌) ఆదేశాలు జారీ చేసింది. పునఃధ్రువీకరణ జరగని పక్షంలో ఆ మొబైల్‌ కనెక్షన్‌ను తొలగిస్తారు. వినియోగదారులు ఏ సిమ్‌ కార్డులను అట్టేపెట్టుకుంటారో ఎంపిక చేసుకునే సౌలభ్యం కల్పించి, మిగతా కనెక్షన్‌లకు డీ యాక్టివేట్‌ చేయాల్సిందిగా డాట్‌ ఆదేశించింది.

ఆర్థిక నేరాలు, అవాంఛిత కాల్స్‌, నేరపూరిత కార్యకలాపాల నిరోధానికి డాట్‌ తాజా ఆదేశాలు ఇచ్చింది. మళ్లీ ధ్రువీకరణ చేయించుకోని అదనపు మొబైల్‌ కనెక్షన్లు డిసెంబరు 7 నుంచి 60 రోజుల్లోగా రద్దవుతాయి.

ఒకవేళ చందాదారు విదేశీ పర్యటనల్లో/ఆసుపత్రిలో ఉంటే మరో 30 రోజులు అదనపు సమయం ఇస్తారు. ఒకవేళ ఇలాంటి నెంబరు నుంచి ఇబ్బందికర కాల్స్‌ వస్తున్నాయని ఏదైనా చట్టబద్ధ సంస్థ నిర్ధారిస్తే, 15 రోజుల్లో రద్దవుతుంది.

ఇదీ చదవండి:మీ ఆధార్​ కార్డ్​పై దొంగ సిమ్​లు ఉన్నాయా? తెలుసుకోండిలా..

ABOUT THE AUTHOR

...view details