తెలంగాణ

telangana

By

Published : May 10, 2021, 12:48 PM IST

ETV Bharat / business

రెనో ​నుంచి మొట్టమొదటి ఎలక్ట్రిక్​ ఎస్​యూవీ

ఫ్రెంచ్​ ఆటోమొబైల్ దిగ్గజం రెనో.. మొట్టమొదటి సారిగా ఎలక్ట్రిక్​ ఎస్​యూవీ వాహనాన్ని అందుబాటులోకి తీసుకురానుంది. ఇప్పటికే ఈ కారుకు సంబంధించిన వెనకభాగాన్ని విడుదల చేసింది ఈ సంస్థ. దీంతో ఎస్​యూవీపై మరింత ఆశలు పెంచింది.

Megan E-Tech
రెనాల్ట్ ​నుంచి మొట్టమొదటి ఎలక్ట్రిక్​ ఎస్​యూవీ

ఫాన్స్​కు చెందిన ప్రముఖ ఆటోమొబైల్ సంస్థ రెనో​ మొదటి సారిగా ఎలక్ట్రిక్​ ఎస్​యూవీని తీసుకురానుంది. మేఘన్​ ఈ టెక్​ పేరుతో వస్తున్న ఈ ఎస్​యూవీ వచ్చే ఏడాది ప్రారంభం నుంచి అందుబాటులోకి రానుంది. దీనికంటే ముందుగా వాహనానికి సంబంధించి వెనుకభాగాన్ని విడుదల చేసింది. అయితే ఈ ఏడాది చివరికి దీని పూర్తి స్థాయి అవుట్​లుక్ బయటకు వస్తుందని సంస్థ తెలిపింది. 2025 నాటికి 24 కొత్త మోడళ్లను విడుదల చేయాలనే లక్ష్యంగా పెట్టుకున్న ఈ ఫ్రెంచ్ ఆటోమొబైల్​ దిగ్గజం.. వాటిలో మేఘన్ ఈ టెక్ ఒకటని పేర్కొంది.

ఇన్​సైడ్​ బాడీ

రెనో​ విడుదల చేసిన దానిలో కారు పేరుతో పాటు లోగో ఉంది. ఇందులో చివరిగా ఉండే అక్షరం బంగారు రంగులో కనిపిస్తోంది. సైడ్​ లైట్లు మొత్తంగా కారునే చుట్టేసేలా ఉన్నాయి. వీటి మధ్యలో లోగోని ఉంచారు.

ఇన్​సైడ్​ బాడీ

రెనో తీసుకువస్తున్న మేఘన్​ ఈ-టెక్ వాహనం సీఎంఎఫ్-ఈవీ ప్లాట్‌ఫామ్ ఆధారంగా రూపుదిద్దుకుంటోంది. ఇదే ఫ్లాట్​ఫామ్​ ఆధారంగానే ఇతర సంస్థలు కూడా వాహనాలను తీసుకువచ్చాయి. ఈ వాహనం పొడవు నాలుగు మీటర్లు వరకు ఉండొచ్చని తెలుస్తోంది.

ప్రత్యేకతలు..

  • 217 హార్స్​పవర్​
  • 300 ఎన్ఎమ్ ఎలక్ట్రిక్ మోటారు
  • 8 సెకన్లలోపే 100 కిమీ వేగాన్ని పుంజుకొగలదు
  • 60 కిలోవాట్ల బ్యాటరీ
  • సింగిల్ ఛార్జ్‌లో సుమారు 450 కి.మీ ప్రయాణం

ఇదీ చూడండి:కారు కొనాలనుకుంటున్నారా? ఇవి తెలుసుకోండి..

ABOUT THE AUTHOR

...view details