దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు రికార్డు స్థాయికి పెరుగుతూ సామాన్యుల జేబులకు చిల్లు పెడుతున్నాయి. ఇప్పటికే చాలా ప్రాంతాల్లో పెట్రోల్ ధర లీటర్‌కు రూ.100 దాటగా.. మరిన్ని ప్రాంతాల్లో సెంచరీకి అడుగు దూరంలో ఉంది.
దేశ రాజధాని దిల్లీలో లీటర్ పెట్రోల్ ధర సోమవారం 28 పైసలు పెరిగి.. రూ.95.37 వద్దకు చేరింది. డీజిల్ ధర కూడా లీటర్‌పై 27 పైసలు.. పెరిగి రూ.86.28 వద్ద ఉంది.
అంతర్జాతీయంగా పెరిగిన ముడి చమురు ధరలకు అనుగుణంగా దేశీయంగానూ పెట్రోల్, డీజిల్ ధరలు పెంచినట్లు చమురు మార్కెటింగ్ సంస్థలు చెబుతున్నాయి.