దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు అతి స్వల్పంగా దిగొచ్చాయి. దాదాపు 24 రోజులు స్థిరంగా ఉన్న పెట్రోల్ ధర లీటర్కు 18 పైసలు, లీటర్ డీజిల్ ధర 17 పైసలు తగ్గింది.
తగ్గిన పెట్రోల్ ధరలు
By
Published : Mar 24, 2021, 10:12 AM IST
|
Updated : Mar 24, 2021, 10:35 AM IST
దేశవ్యాప్తంగా 24 రోజుల తర్వాత పెట్రోల్, డీజిల్ ధరల్లో స్వల్ప మార్పు కనిపించింది. ఆశ్చర్యకరంగా ఈ సారి పెట్రోల్ ధరలను స్వల్పంగా తగ్గిస్తూ చమురు మార్కెటింగ్ సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి. ఇటీవలి నెలల్లో పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గటం ఇదే ప్రథమం.
ఎంత తగ్గింది..?
దేశ రాజధాని దిల్లీలో లీటర్ పెట్రోల్ ధర బుధవారం 18 పైసలు తగ్గి.. రూ.91.03 వద్దకు చేరింది. లీటర్ డీజిల్ ధర 17 పైసలు దిగొచ్చింది. దీనితో డీజిల్ ధర లీటర్కు రూ.81.34 వద్దకు చేరింది.
అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు దిగొస్తున్న నేపథ్యంలో దేశీయంగా పెట్రోల్, డీజిల్ ధరలను స్వల్పంగా తగ్గించాయి చమురు మార్కెటింగ్ సంస్థలు.
దేశవ్యాప్తంగా ఇతర మెట్రో నగరాల్లోనూ.. పెట్రోల్ ధర అత్యల్పంగా 16 పైసల నుంచి అత్యధికంగా 18 పైసల వరుకు తగ్గింది. డీజిల్ ధర కనిష్ఠంగా 16 పైసల నుంచి గరిష్ఠంగా 19 పైసలు పైసల వరకు దిగొచ్చింది.