గతేడాది ఆగస్టులో అప్పటి అమెరికా అధ్యక్షుడు ట్రంప్.. టిక్‌టాక్‌పై ఆంక్షలు విధిస్తానని హెచ్చరించారు. భద్రతా కారణాల దృష్ట్యా ఈ సామాజిక మధ్యమాన్ని అమెరికాకు చెందిన దిగ్గజ సంస్థకు విక్రయించాలని డెడ్‌లైన్ విధించారు. మైక్రోసాఫ్ట్ ఈ డీల్ పూర్తిచేయాలని ఒత్తిడి చేశారు. ఈ మొత్తం వ్యవహారం తన జీవితంలో క్లిష్టమైన విషయమని మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల(satya nadella news) తాజాగా వెల్లడించారు. 'ద కోడ్ కాన్ఫరెన్స్' కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. ఈ డీల్ వ్యవహారం(microsoft tiktok acquisition) వింతైన అనుభవమంటూ... పలు ఆసక్తికర సంగతులు చెప్పారు.
"నా జీవితంలో అత్యంత క్లిష్టమైన డీల్(microsoft tiktok deal ) అదే. అంత పెద్ద విలువైన ఒప్పందంపై అప్పుడు నాకు చాలా ఆసక్తిగా ఉంది. ఒకింత సంతోషంతో డీల్ పూర్తిచేయాలని ముందుకుసాగాం. ఇది పూర్తయితే సరికొత్త చరిత్ర అవుతుందని ఊహించా. కానీ అర్థాంతరంగా అది ఆగిపోయింది." అని సత్య నాదెళ్ల చెప్పారు.
అయితే ఈ డీల్ వ్యవహారానికి సంబంధించి మరిన్ని వివరాలు వెల్లడించాలని జర్నలిస్టు కాకర స్విషెర్ నాదెళ్లను ఒత్తిడి చేశారు. దీంతో ఆయన మాట్లాడుతూ.. 'ముఖ్యమైన విషయం ఏంటంటే డీల్ కోసం టిక్‌టాక్ సంస్థే మా వద్దకు వచ్చింది. తొలుత మేము వారిని సంప్రదించలేదు. టిక్‌టాక్ సోషల్ మీడియా ఫ్లాట్‌ఫాం కావడం, క్లౌడ్ బేస్డ్ సర్వీస్ కావడం, ఏఐని ఎక్కువగా ప్రభావితం చేయడం వల్ల మాకు ఆసక్తి ఉంది. మైక్రోసాఫ్ట్ కూడా ప్రధానంగా వాటిపైనే దృష్టి సారిస్తుండటం దానికి ప్రధాన కారణం." అని వివరించారు.
డీల్ పూర్తయి ఉంటే(microsoft tiktok acquisition) టిక్‌టాక్‌కు మైక్రోసాఫ్ట్ ఆసక్తికరమైన భాగస్వామిగా ఉండేదని నాదెళ్ల అభిప్రాయపడ్డారు. సోషల్ మీడియాలో పెట్టుబడులు పెట్టడం, ప్రత్యేకించి తాము కంటెంట్ మోడరేషన్ పిల్లల భద్రత వంటి అంశాలపై పని చేస్తుండటం రెండు సంస్థలకు కలసివచ్చే విషయమన్నారు. అమెరికాకు చెందిన సంస్థే క్లౌడ్ సర్వీస్ అందిస్తుండం కూడా ఈ డీల్‌లో కీలకమైన విషయమని, ట్రంప్ ప్రభుత్వం కూడా దీన్నే కోరుకుందని పెర్కొన్నారు.
అయితే డీల్ కుదుర్చుకోవడానికి ట్రంప్ ప్రభుత్వానికి కొన్ని నిర్దిష్టమైన అవసరాలున్నాయని నాదెళ్ల వివరించారు. కానీ ఎన్నికల్లో ప్రభుత్వం ఓడిపోయిందని గుర్తు చేశారు. ట్రంప్ ఏం చేయాలనుకుంటున్నారనే విషయంపై తనకు కచ్చితమైన అభిప్రాయం ఉందని, కానీ తర్వాత ఆ డీల్ కుదల్లేదని చెప్పారు.