ఇజ్రాయెల్‌లో తయారైన ఒక స్పైవేర్.. ప్రపంచవ్యాప్తంగా లక్ష్యంగా చేసుకొన్న 1400 మందిలో భారతీయ జర్నలిస్టులు, మానవహక్కుల కార్యకర్తలు ఉన్నట్లు సామాజిక మాధ్యమం వాట్సాప్ వెల్లడించింది. ఇజ్రాయెల్‌కు చెందిన ఎన్ఎస్ఓ గ్రూప్ తయారు చేసిన సాఫ్ట్‌వేర్ దీనికి కారణమని తెలిపింది. ఆ గ్రూప్‌పై కాలిఫోర్నియా ఫెడరల్ కోర్టులో కేసు దాఖలు చేసినట్లు పేర్కొంది.
ఏప్రిల్-మే నెలల్లో జరిగిన సైబర్ దాడుల వెనుక ఇజ్రాయెల్ ఎన్ఎస్ఓ సంస్థ హస్తం ఉందని వాట్సాప్ ఆరోపిస్తోంది. ఈ సంస్థ కనీసం 100 మంది పౌరులను లక్ష్యంగా చేసుకున్నట్లు.. వాట్సాప్ ప్రతినిధులు వెల్లడించారు. ఇదేమీ పొరపాటున జరిగిన తప్పు కాదన్న వాట్సాప్.. భారతీయ జర్నలిస్టులు, మానవహక్కుల కార్యకర్తలే వీరి లక్ష్యమని తెలిపింది. ఐతే వీరి వివరాలు, సంఖ్యను చెప్పేందుకు నిరాకరించింది.
40 కోట్ల మంది వినియోగం..