అగ్ర దేశమా.. చిన్న దేశామా అని కాదు అన్ని దేశాలకూ సైబర్ మోసగాళ్ల ముప్పు పొంచి ఉన్న రోజులివి. చిన్న కంపెనీలే కాదు.. అగ్రశ్రేణి కంపెనీల కంప్యూటర్ వ్యవస్థలూ హ్యాకర్ల బారిన పడుతున్నాయి. అందుకే సైబర్ మోసాల నియంత్రణకు అన్ని దేశాల ప్రభుత్వాలు, కంపెనీలు అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నాయి. ఫలితంగా సైబర్ సెక్యూరిటీ ఉత్పత్తులకు గిరాకీ పెరుగుతోంది. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకునే పనిలో దేశీయ అంకురాలున్నాయి. సైబర్ సెక్యూరిటీ అంకురాల సంఖ్య పెరగడమే కాదు.. వీటికి ప్రధాన కేంద్రంగా భారత్ అవతరించిందని, 2018తో పోలిస్తే వీటి ఆదాయాలు రెట్టింపు అయ్యాయని ఓ నివేదిక వెల్లడిస్తోంది. ఇక్కడి సైబర్ సెక్యూరిటీ సంస్థలు దేశీయంగానే కాకుండా అంతర్జాతీయ కంపెనీలకూ తమ సేవలను అందిస్తున్నాయని పేర్కొంది. డేటా సెక్యూరిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా(డీఎస్‌సీఐ) రూపొందించిన ఈ నివేదికలోని వివరాలేమిటో చూద్దామా..
ఎక్కడ నుంచి ఎంతెంత
భారత్ సైబర్ సెక్యూరిటీ అంకురాలు ఆర్జిస్తున్న మొత్తం ఆదాయాల్లో 63 శాతం వరకు భారత్ నుంచే వస్తుండగా.. ఉత్తర అమెరికా నుంచి 16 శాతం ఉంటోంది.
బ్యాంకింగ్, ఆర్థిక సేవలు, ఐటీ రంగాల నుంచి అధిక ఆదాయం వస్తోంది. ఆరోగ్య సంరక్షణ, ఇ-కామర్స్, తయారీ రంగాల నుంచీ ఆదాయం గణనీయంగానే ఉంటోంది.
విదేశాలకు 24% సంస్థలు
అంతర్జాతీయ విపణుల్లో అవకాశాలు పుష్కలంగా ఉన్నాయనే విషయాన్ని గమనించడంతో, గత రెండేళ్లలో 24 శాతం సంస్థలు విదేశాలకు తమ కార్యకలాపాలను విస్తరించాయి. అమెరికా, ఆస్ట్రేలియా, సింగపూర్, నెదర్లాండ్స్ లాంటి దేశాల్లోకి అడుగుపెట్టాయి.
నిధులు ఎలా..