తెలంగాణ

telangana

By

Published : Apr 6, 2021, 7:47 PM IST

Updated : Apr 6, 2021, 8:00 PM IST

ETV Bharat / business

'2021లో 12.5 శాతానికి దేశ జీడీపీ'

2021లో దేశ జీడీపీ 12.5 శాతానికి పెరుగుతుందని అంతర్జాతీయ ద్రవ్య నిధి అంచనా వేసింది. కరోనా సమయంలో భారత జీడీపీ 8 శాతం క్షీణించిందని పేర్కొంది.

IMF on india's GDP
'2021లో 12.5 శాతానికి దేశ జీడీపీ'

కరోనా కారణంగా 2020లో భారీగా క్షీణించిన భారతదేశ జీడీపీ 2021లో 12.5 శాతానికి పెరుగుతుందని అంతర్జాతీయ ద్రవ్యనిధి(ఐఎం​ఎఫ్​) ఆశాభావం వ్యక్తం చేసింది. కరోనా నేపథ్యంలో 2020లో భారత‌ జీడీపీ రికార్డు స్ధాయిలో 8 శాతం క్షీణించగా.. చైనా 2.3 శాతం వృద్ధి నమోదు చేసింది.

2021లో భారతదేశ వృద్ధి రేటు.. చైనా కంటే ఎక్కువే ఉంటుందని ఐఎం​ఎఫ్​ తెలిపింది. చైనా వృద్ధి రేటు 2021లో 8.6 శాతం, 2022లో 5.6 శాతానికి పెరగవచ్చని అంచనా వేసింది. 2022లో భారత‌ జీడీపీ 6.9 శాతం వృద్ధి చెందొచ్చని వెల్లడించింది.

2021, 2022లో ప్రపంచ ఆర్థిక వృద్ధి రేటు కూడా తాము అంచనా వేసినదాని కంటే ఎక్కువే నమోదవుతుందని ఐఎం​ఎఫ్​ ముఖ్య ఆర్థికవేత్త గీతా గోపీనాథ్‌ తెలిపారు. ప్రపంచ ఆర్థిక వృద్ధి రేటు 2021లో 6 శాతం, 2022లో 4.4 శాతంగా నమోదు కావచ్చని వెల్లడించారు.

ఇదీ చదవండి:వీర జవాన్లకు నీటిలో తేలుతూ.. నివాళి

Last Updated : Apr 6, 2021, 8:00 PM IST

ABOUT THE AUTHOR

...view details