జాతీయ వాహన తుక్కు విధానంలో(national scrap policy 2021) భాగంగా, పాత వాహనాన్ని తుక్కుగా మార్చిన తర్వాత కొత్త వాహనాన్ని కొనుగోలు చేసేవారికి మరిన్ని పన్ను ప్రోత్సాహకాలు అందించాలనే ప్రతిపాదనను ప్రభుత్వం పరిశీలిస్తోందని కేంద్ర రవాణా, రహదారుల మంత్రి నితిన్ గడ్కరీ(nitin gadkari vehicle scrappage policy) వెల్లడించారు. కాలం తీరిన వాహనాలను (ఈఎల్‌వీలు) తుక్కుగా మార్చి, రీసైక్లింగ్ చేసేందుకు ప్రభుత్వం ఆమోదించిన రీతిలో మారుతీ సుజుకీ(maruti suzuki scrap auction) టయోత్సు ఇండియా నెలకొల్పిన తొలి ప్లాంట్‌ను ప్రారంభించిన సందర్భంగా గడ్కరీ మాట్లాడారు.
"తుక్కు విధానం వల్ల దేశంలో కాలుష్యం తగ్గుతుందని, వస్తు, సేవల పన్ను (జీఎస్‌టీ) ఆదాయం కేంద్ర, రాష్ట్రాలకు చెరో రూ.40,000 కోట్ల మేర పెరుగుతుందని మంత్రి చెప్పారు. ఆర్థిక మంత్రితో సంప్రదించి, మరిన్ని (పన్ను సంబంధిత) రాయితీలను వాహన తుక్కు విధానంలో కల్పిస్తాం"
--నితిన్ గడ్కరీ
ఈ కార్యక్రమంలో పాల్గొన్న మారుతీ సుజుకీ ఇండియా ఎండీ(maruti suzuki md), సీఈఓ కెనిచి అయుకవా.. వాహన సామర్థ్యాన్ని ప్రతి 3-4 ఏళ్లకు ఒకసారి పరీక్షించే విధానం రావాలని ఆకాంక్షించారు.
- వాహన తుక్కు విధానంలో పాత వాహనాలను తుక్కుగా మార్చి, కొత్త వాహనం కొనుగోలు చేస్తే ఆయా రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు (యూటీలు) రహదారి పన్నుపై 25 శాతం రాయితీ ఇస్తాయని కేంద్రం తెలిపింది. జీఎస్‌టీ మండలి కూడా ఈ విధానం కింద మరిన్ని ప్రోత్సాహకాలు అందించేందుకు ఉన్న అవకాశాలను పరిశీలించాలని గడ్కరీ సూచించారు.
- తయారీ రంగాన్ని ప్రోత్సహించి, కొత్త ఉద్యోగాల సృష్టికి తుక్కు విధానం దోహదపడుతుందన్నారు. కొత్త వాహన విక్రయాలు 10-12 శాతం మేర పెరిగొచ్చన్నారు.
- రీసైక్లింగ్(recycling old vehicle) వల్ల ముడి పదార్థాలు తక్కువ ధరకే లభ్యమై, ఉత్పత్తి వ్యయాలు తగ్గుతాయని గడ్కరీ వివరించారు. దేశంలోని ప్రతి జిల్లాలోనూ కనీసం 3-4 వాహన రీసైక్లింగ్ లేదా తుక్కు కేంద్రాలను ఏర్పాటు చేయాలన్నది కేంద్ర ప్రణాళికగా వివరించారు. వచ్చే రెండేళ్లలో దేశంలో 200-300కు పైగా ఇలాంటి కేంద్రాలు ఉంటాయని తెలిపారు.
- ప్రస్తుతం వాహన రంగ వార్షిక టర్నోవర్ రూ.7.5 లక్షల కోట్లు కాగా, దీన్ని వచ్చే అయిదేళ్లలో రూ.15 లక్షల కోట్లకు చేర్చాలనుకుంటున్నట్లు గడ్కరీ వెల్లడించారు. 2070 నాటికి భారత్ కర్బన ఉద్గార రహితంగా మారేందుకు తుక్కు విధానం ఎంతో కీలకమైనదని పేర్కొన్నారు.
ఇదీ ప్లాంటు..
టయోటా సుషో గ్రూప్, టయోటా సుషో ఇండియా ప్రై.లి.తో కలిసి 50-50 భాగస్వామ్యంలో మారుతీ సుజుకీ 2019 అక్టోబరు 22న మారుతీ సుజుకీ టయోత్సును ఏర్పాటు చేసింది. కొత్తగా ప్రారంభించిన ప్లాంట్ 10,993 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఉంది. ఇక్కడ ఏటా 24,000 వాహనాలను తుక్కుగా మార్చి రీసైక్లింగ్ చేసే అవకాశం ఉంది.
ఇవీ చదవండి: